విప్లవాత్మక చిత్రాలకు పెట్టింది పేరు టి.కృష్ణ. తెలుగు తెరపై కృష్ణ గారి రివెల్యూషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ టాలీవుడ్ మెచ్చిన ఏకైక మేకర్. గోప్ప అభ్యుదయ భావజాలం కల దర్శకుడు. అందుకే `నేటి భారతం`..`దేశంలో దొంగలుపడ్డారు`..`దేవాలయం`..`వందేమాతరం`..`ప్రతిఘటన`..`రేపటి పౌరులు` లాంటి గొప్ప కళా ఖండాలు వెలసిల్లాయి.
తెరకెక్కించినవి కొన్ని సినిమాలే అయినా గొప్ప చిత్రాలతో టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయారు. ఆయన వారసుడిగా టాలీవుడ్ లోకి గోపీచంద్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాయన దర్శకుడు అయినా...తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. ఇక టి. కృష్ణ గొప్ప సేవా దృక్ఫథం గలవారు కూడా.
పిల్లలకు విద్య దూరం అవుతుందని సొంతంగా స్కూల్ సైతం నిర్మాణం చేపట్టి...అందులో టీచర్లుగా ఉన్నత చదువులు చదువుకున్న వారిని నియమించి ఎంతో మంది విద్యార్ధుల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టారని చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే అందులో నిజమెంత? అన్నది అంతే కాలంగా సందేహంగానూ ఉంది. తాజాగా ఈ విషయాన్ని గోపీచంద్ ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేసారు.
``ఒంగోలు నుంచి 15-18 కిలోమీటర్ల దూరంలో కాకుటూరి వారి పాలెం అనే గ్రామం ఉంటుంది. మా అమ్మనాన్నలది అదే ఊరు. చుట్టాలు..బంధువులు అంతా అక్కడే ఉండేవారు. అక్కడ పిల్లలకి సరైన విద్య లేదు. చుట్టు పక్కల చాలా చోట్ల తిరిగారు నాన్న. ఎక్కడా సరైన స్కూల్స్ లేవని భావించి ఆయనే సొంతంగా స్కూల్ పెడితే బాగుంటుందని ఆలోచనకి వచ్చారు.
నాతో పాటు..మిగతా పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంటుందని స్కూల్ కట్టారు. చెన్నై నుంచి డీ కోమలం అనే రీటైర్డ్ టీచర్ ని తీసుకొచ్చి స్కూల్ హెడ్ గా నియమించారు. ఆ స్కూల్ `నిల దీస్పారండం` అని పేరు పెట్టారు. అది ఒక ప్రెంచ్ వర్డ్. జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవ్వాలి అన్న మీనింగ్ తో ఉంటుంది. ఎలాంటి ఆటు పోటులు ఎదురైనా జీవితంలో సక్సెస్ దిశగానే ప్రయాణం చేయాలి అని చాలా బలంగా ఆ వర్డ్ చెబుతుంది. అందుకే నాన్న గారు ఆ ప్రెంచ్ వర్డ్ ని స్కూల్ పేరుగా పెట్టారు. ఆ స్కూల్ లో అప్పట్లో చాలా మంది పిల్లలు చదువుకున్నారు. మంచి టీచర్లు ఉండేవారని గోపీచంద్ తెలపడంతో ఆ సస్పెన్స్ వీడింది.
ప్రస్తుతం గోపీచంద్ `పక్కా కమర్శియల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. జులై 1న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రచారం పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన సంగతి తెలిసిందే.