మార్చ్ నుండి తండ్రికొడుకుల మల్టీస్టారర్ షూట్!

Update: 2021-02-15 14:49 GMT
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. ప్రస్తుతం మూడు వేర్వేరు సినిమాల చిత్రికరణతో చాలా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. గత కొంతకాలంగా విక్రమ్ ఖాతాలో సరైన హిట్టు పడలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా విక్రమ్ ప్రస్తుతం కోబ్రా సినిమా షూటింగ్ హోల్డ్ లో పెట్టాడట. డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్ కోసం విక్రమ్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు.

 అయితే తాజా సమాచారం ప్రకారం.. విక్రమ్, తన కొడుకు ధ్రువ్ కలిసి నటించబోయే సినిమా మార్చి నెల నుండి ప్రారంభం కాబోతుందట. ఈ మల్టీస్టారర్ మూవీ విక్రమ్ కెరీర్లో 60 వ మూవీ కావడం విశేషం. ఇప్పటికే సినిమా కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు షెడ్యూల్స్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట.

తమిళనాడు లోనే సినిమా షూట్ కోసం పలు లొకేషన్స్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ చివరి హిట్ మూవీ ఇంకొక్కడు. ప్రస్తుతం హిట్టు తప్పనిసరిగా అనే పరిస్థితిలో ఉన్నాడు హీరో. అందుకే 60వ సినిమాకోసం  యంగ్ డైరెక్టర్ కార్తీక్ తో చేతులు కలిపాడు. మొదటిసారి విక్రమ్ తన కొడుకు ధృవ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ఆఫీసియల్ పోస్టర్ కూడా గతంలోనే విడుదల చేసారు మేకర్స్.

అయితే తండ్రితో కలిసి నటించాడనికి ధృవ్ కూడా శారీరకంగా, మానసికంగా సిద్ధం అవుతున్నాడు. అయితే అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ క్రేజీ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీగా నిర్మించనుంది. ఇదిలా ఉండగా కార్తీక్ సుబ్బరాజు ప్రస్తుతం ధనుష్ తో జగమేతంత్రం మూవీ చేసాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది.
Tags:    

Similar News