మదర్స్ డే స్పెషల్ ఫోటోలు ఇవే

Update: 2019-05-12 11:16 GMT
ప్రతి ఏడాది మే నెలలో రెండవ ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా 'మదర్స్ డే' గా జరుపుకుంటారు. మన ఇండియన్ కల్చర్ కాదని ప్రతి రోజూ అమ్మను గౌరవించుకోవల్సిందే కానీ ఒకరోజు మాత్రం గౌరవించడం ఏంటని కొందరు విమర్శిస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే బాలీవుడ్ మాత్రం మదర్స్ డే సెలబ్రేషన్స్ లో పూర్తిగా మునిపోయింది.  అమీర్ ఖాన్ లాంటి స్టార్ల నుండి అలియా భట్ లాంటి ఈ జెనరేషన్ హీరోయిన్ల వరకూ తమ ఇన్స్టా ఖాతాల ద్వరా తమ అమ్మగారి ఫోటోలు పోస్ట్ చేసి మరీ హ్యాపీ మదర్స్ డే చెప్పారు.

*అమీర్ ఖాన్ తను చిన్న బాబుగా ఉండే సముయంలో అమ్మగారితో  తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేసి "అమ్మ.. నేను.  ఈ ప్రపంచంలో బెస్ట్ అమ్మ" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

*బాలీవుడ్ క్వీన్ కంగన టీమ్ మెయింటైన్ చేసే ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసి "అమ్మలు అందరికీ వెరీ హ్యాపీ మదర్స్ డే.  ప్రతి కూతురు తన పెద్దయ్యాక తన అమ్మలాగే కావాలని అనుకుంటుంది.  నేను కూడా అలానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

* శ్రద్ధా కపూర్ తన చిన్ననాటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి "మా అమ్మ నా జీవితం. నాకు అంతా అమ్మే.  హ్యాపీ మదర్స్ డే మమ్మీ.  నీ నిస్వార్థమైన ప్రేమ.. నీ మ్యాజిక్.. ఒక పనిని నువ్వు చేసే విధానం నన్ను ఎప్పుడూ ఇన్స్ పైర్ చేస్తుంటాయి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

* శిల్పా శెట్టి తన అమ్మగారు.. కొడుకుతో కలిసి ధ్యానం చేసున్న వీడియో పోస్ట్ చేసి "అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఫ్యామిలీ అంతా కలిసి యోగా చేస్తూ మా మదర్స్ డే ని ప్రారంభించాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

*జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అమ్మగారితో కలిసి ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేసి "అమ్మ నిన్ను మిస్ అవుతున్నా.. హ్యాపీ మమ్మీస్ డే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

* వరుణ్ ధావన్ తన అమ్మతోనూ.. పెద్దమ్మతోనూ ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి "హ్యాపీ మదర్స్ డే.  అమ్మతో ఒక ఫోటో.. పెద్దమ్మతో ఒక ఫోటో.  ఆమె కూడా నాకు అమ్మలాగే. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ అమ్మలకు శుభాకాంక్షలు.  అమ్మలా ఉండే వారికి కూడా హ్యాపీ మదర్స్ డే" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

*సోనమ్ కపూర్ తన అమ్మగారితో ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేసి "నాకు తెలిసి ఎంతో దయ ఉన్న.. ప్రేమ ఉన్న అమ్మకు హ్యాపీ మదర్స్ డే.  నువ్వు ఎంతో నిస్వార్థంగా ఉన్నదుకు థ్యాంక్ యూ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

*అలియా భట్ తన చిన్ననాటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి "నేను హ్యాపీగా ఉండే ప్లేస్.  లవ్ యూ అమ్మా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

*తాప్సీ తన అమ్మగారితో కల్సి ఓటు వేసిన తర్వాత తీయించుకున్న ఫోటో ను పోస్ట్ చేసి "నేను అమ్మ.. భారత్ మాత కోసం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

*కృతి సనన్ తన అమ్మగారి తో దిగిన పాత ఫోటో ఒకటి.. కొత్తది ఒకటి కలిపి పోస్ట్ చేసి 'హ్యాపీ మదర్స్ డే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇంకా చాలా చాలా మంది ఇలా మదర్స్ డే విషెస్ తెలిపారు.
Tags:    

Similar News