వర్మ నో అబ్జెక్షన్‌ ఇస్తేనే ఆ టైటిల్‌ ఇస్తారట!

Update: 2020-01-11 04:55 GMT
వివాదాస్పద చిత్రాలు తీయాలన్నా.. వాటికి టైటిల్స్‌ వివాదాస్పదంగా పెట్టాలన్నా కూడా వర్మ తర్వాతే ఎవరైనా. రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతటి వివాదాస్పద సినిమాను అయినా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలడు. కాని ఇతరులు ఎవరు కూడా అలా ప్రయత్నాలు చేసినా సక్సెస్‌ అవ్వలేరు. ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మపై రచయిత జొన్నవిత్తుల ఒక సినిమాను తీసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు ఆర్జీవీ అనే టైటిల్‌ పెట్టి ఒక సైకో బయోపిక్‌ అంటూ ట్యాగ్‌ లైన్‌ పెట్టాలనుకుంటున్నాడు.

ఫిల్మ్‌ ఛాంబర్‌ లో ఈ టైటిల్‌ ను నిర్మాతలు రిజిస్ట్రర్‌ చేయించేందుకు ప్రయత్నించగా వర్మ నుండి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకు రావాల్సిందే అంటున్నారట. రామ్‌ గోపాల్‌ వర్మ పేరు మరియు ఆయనపై సినిమా తీయబోతున్నారు కనుక ఖచ్చితంగా ఆయన నుండి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకు రావాల్సిందే అంటూ ఛాంబర్‌ వారు అబ్జక్షన్‌ పెట్టడంతో నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఇతర వివాదాస్పద సినిమాలకు ఎలాంటి అబ్జక్షన్‌ పెట్టని మీరు ఎందుకు మా సినిమాను అడ్డుకునేందుకు చూస్తున్నారు అంటూ నిర్మాతలు ఛాంబర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ నుండి నో అబ్జక్షన్‌ తీసుకు రావడం సాధ్యం కాదు కనుక మరేదైనా టైటిల్‌ ను పెడతారేమో చూడాలి.

ఆమద్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సందర్బంగా వర్మ మరియు జొన్నవిత్తుల మద్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. అప్పుడే వర్మ మీద ఒక బయోపిక్‌ తీస్తానంటూ జొన్నవిత్తుల ప్రకటించడం.. అన్నట్లుగానే కథను తయారు చేసి షూటింగ్‌ కు వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మరి ఈ చిత్రంకు ఎదురు దెబ్బ తలిగింది. మరి చిత్ర యూనిట్‌ సభ్యులు అలాగే ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News