ఇటీవలే టాలీవుడ్ కి చెందిన యువ ఫిలింక్రిటిక్ జెమిని శ్రీను మరణం కలచి వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో వార్త ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు బాక్స్ ఆఫీస్ ట్రాకర్ ఎల్.ఎమ్ కౌశిక్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. అతనికి కేవలం 36 ఏళ్లు.
తాజా సమాచారం మేరకు.. కౌశిక్ గుండె పోటు(హెవీ కార్డియాక్ అరెస్ట్)తో తుది శ్వాస విడిచాడు. అతడి ఆకస్మిక మరణం మీడియా ఇతర సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ కి కౌశిక్ పేరు సుపరిచితం. అతడు పాపులర్ 'గలాటా'కు వీజేగా కూడా పనిచేశారు. సినిమా సమీక్షకుడిగా అతడికి సామాజిక మాధ్యమాల్లో చక్కని ఫాలోయింగ్ ఉంది.
కౌశిక్ మరణానికి కోలీవుడ్ సహా టాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రఖ్యాత సినీ విమర్శకుడు.. చలనచిత్ర విమర్శకుడు .. గలాట్టా VJ ఎల్.ఎం మూవీ మానియాక్ ఈరోజు గుండెపోటు కారణంగా మరణించారు.
అతని మరణం వ్యక్తిగతంగా తీరని లోటు.. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు బలమైన మద్దతును తెలియజేస్తున్నాము'' అని గలాట్టా సంతాపం ప్రకటించింది. కౌశిక్ ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.