ప్రతి భాష సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకరు నోటి దూల వారు ఉంటారు. వారు పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడేందుకు సిద్దం అవుతారు. వారు చేసే వ్యాఖ్యల వల్ల అవతలి వారు ఎంతగా బాధించబడుతారు అనే విషయాన్ని కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాగేస్తూ ఉంటారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతి చోట ఇలాంటి వారు ఉన్నారు. కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు అయితే మరి కొందరు మీడియాకు చెందిన వారు ఉన్నారు. ఇండస్ట్రీలో కొనసాగలనుకునే వారు అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. కాని ఎప్పుడైతే సినిమాల్లో ఆఫర్లు రావనే కన్ఫర్మేషన్ కు వస్తారో అప్పుడు అన్ని విషయాలపై స్పందిస్తూ మీడియాలో నిలుస్తూ ఉంటారు. ఇక మీడియా కు చెందిన వారు కూడా ఫేమస్ అయి పోవాలనే ఉద్దేశ్యంతో ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మన వుడ్ విషయాన్ని వదిలేస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో అదే కథ జరుగుతోంది.
బాలీవుడ్ ప్రముఖులను ఇష్టానుసారంగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి సినీ విమర్శకుడు అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్. ఈయన తనకు తాను నటుడు దర్శకుడు విమర్శకుడు రైటర్ అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆ మద్య సల్మాన్ ఖాన్ ను అనడంతో కోర్టు లు కేసుల వరకు వెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా ఆగకుండా ఇటీవల అమీర్ ఖాన్ కిరణ్ రావుల విడాకుల విషయమై వ్యాక్యలు చేశాడు. కిరణ్ రావు వంటి ఆమె అమీర్ ఖాన్ కు ఎలా నచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కళ్ల జోడు ఫేస్ ఆమె అమీర్ కు బోర్ కొట్టి ఉంటుంది. అందుకే ఆమెను వదిలించుకున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు యువ జంట ఆలియా భట్ మరియు రణ బీర్ కపూర్ పై ఈయన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు.
గత కొంత కాలంగా ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిన రహస్యమే. అందుకే వీరిద్దరు పెళ్లికి సిద్దం అవుతున్నారు అంటే అదో పెద్ద సంచలన విషయం కాదు. ఎందుకంటే ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది అయినా పెళ్లికి వారు సిద్దం అవుతారు అంటూ కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది వీరి వివాహం ఉంటుంది. అయితే రణబీర్ మరియు ఆలియాల మద్య సఖ్యత కొంత కాలం వరకు మాత్రమే ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వారిద్దరు విడిపోతారు అంటూ కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యల పై కొందరు కామెంట్స్ చేస్తే నీ నోటి కి తాళం పడదా అంటూ దూషించడం మొదలు పెట్టారు.
ఎవరైనా జీవితాంతం సంతోషంగా గడపాలని కోరుకోవాలి. కాని నీవు మాత్రం నీ అత్యంత కఠినమైన మనసుతో వారు పెళ్లి చేసుకోకుండానే 15 ఏళ్లకు విడి పోతారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నావని ట్రోల్స్ మొదలు పెట్టారు. మరి కొందరు మాత్రం వారి మనస్థత్వాల కారణంగా 15 ఏళ్ల వరకు కూడా కలిసి ఉండక పోవచ్చు అన్నారు. మరి కొందరు మరీ దారుణంగా వారు పెళ్లే చేసుకోరు. పెళ్లి చేసుకోకుండానే మళ్లీ బ్రేకప్ అవుతారు అంటూ కమల్ పోస్ట్ కు కామెంట్స్ చేస్తున్నారు.