ఒక నిర్మాత దారుణానికి తెగబడ్డారు. ఒక నటికి సంబంధించిన బాత్రూమ్ వీడియో క్లిప్ ను లీక్ చేసిన వైనం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై విచారించిన పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. నటి బాత్రూం దృశ్యాల్ని లీక్ చేసింది మరెవరో కాదని.. ఆ నటి నటించిన సినీ నిర్మాతేనని తేల్చారు.
షూటింగ్ లో జరిగిన పొరపాటును అసరా చేసుకొని సదరు నిర్మాత చేసిన దారుణం నిర్ఘాంతపోయేలా చేసింది. అసలేం జరిగిందంటే.. ఉపేంద్రకుమార్ అనే నిర్మాత భోజ్ పురీలో చిన్నా చితకా సినిమాలు.. షార్ట్ ఫిలింస్ తీసేవారు. ఆ మధ్యన ఒక వర్థమాన నటితో ఒక షార్ట్ ఫిలిం తీశాడు. షూటింగ్ లో భాగంగా సదరు నటి బాత్రూం నుంచి టవల్ తో బయటకు వచ్చే సీన్ చేస్తున్నప్పుడు పొరపాటున టవల్ జారి.. అసభ్య దృశ్యాలు కెమేరాలో రికార్డు అయ్యాయి.
వెంటనే తేరుకున్న నటి.. సదరు అసభ్య సీన్లు తొలగించాలని కోరింది. వాటిని తొలగిస్తానన్న నిర్మాత మాటను ఆమె నమ్మింది.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల తర్వాత కొన్ని అడల్ట్ వెబ్ సైట్లలో తన అసభ్య సీన్ క్లిప్ వైరల్ అవుతున్న విషయం ఆమె దృష్టికి వచ్చింది. దీంతో షాక్ తిన్న ఆమె.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు అయ్యాక ఉపేంద్ర కుమార్ బిహార్ వదిలి పారిపోయారు. పోలీసులు జరిపిన విచారణలో నిర్మాతే దోషి అని తేల్చారు. మూడు నెలల పాటు పోలీసులు జరిపిన గాలింపులో ఉపేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.