సెట్స్ లో మంట‌లు.. హీరో హీరోయిన్ స్కిప్..!?

Update: 2022-07-30 05:30 GMT
సెట్స్ లో మంట‌లు.. హీరో హీరోయిన్ స్కిప్..!?
  • whatsapp icon
సెట్స్ లో ఊహించ‌ని ప్ర‌మాదాలు ఒక్కోసారి నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను క‌లిగిస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణ న‌ష్టం కూడా జ‌రుగుతుంటుంది. ఇంత‌కుముందు భార‌తీయుడు 2 సెట్స్ లో క్రేన్ ప్ర‌మాదం గురించి తెలిసిందే. అదే ఏడాదిలో టాలీవుడ్ లో న‌లుగురు హీరోలు ర‌క‌ర‌కాల ప్ర‌మాదాల‌కు గుర‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ప్రారంభ‌మైన ఆదిపురుష్ మూవీ సెట్స్ లోనూ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ భారీగా పొగ‌లు క‌మ్మేయ‌డ‌మే గాక అగ్ని కీల‌లు వ్యాపించ‌డంతో ప్ర‌భాస్ - ఓంరౌత్ టీమ్ ఖంగు తింది. నిర్మాత‌ల‌కు పెద్ద న‌ష్టం వాటిల్లింది.

ఇప్పుడు అలాంటి మ‌రో ప్ర‌మాదం హిందీ సినిమా సెట్స్ లో జ‌రిగింది. రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ జంటగా లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న‌ చిత్రం షూటింగ్ సెట్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా నాయకానాయిక‌లు స్కిప్ కొట్టార‌ని ముంబై మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. ప్ర‌స్తుతం షూటింగ్ ఆగిపోయింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌లే స్పెయిన్ షెడ్యూల్ ముగించారు.

కొద్ది రోజుల క్రితం ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే సెట్స్ లో పెద్ద ప్రమాదం జరగడంతో షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది. ముంబై సబర్బన్ లో ఏర్పాటు చేసిన సెట్ లు అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగక‌పోవ‌డం పెద్ద ఊర‌ట‌నిచ్చింది. కానీ కొంద‌రు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.

కొన్ని గంటల క్రితం.. ముంబై అంధేరీ వెస్ట్ లోని చిత్రకూట్ గ్రౌండ్ నుండి పెద్ద పొగలు రావడం చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఇంత‌లోనే లవ్ రంజన్ సినిమా సెట్స్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపక బృందం స్పాట్ కి చేరుకునేప్ప‌టికే ఈ ప్రమాదంలో సెట్ లోని 3 అంతస్తులు మంటల్లో త‌గుల‌బ‌డ్డాయి. ఈ ప్ర‌మాదంతో మేకర్స్ కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

మంటలు చెలరేగిన వెంటనే రాజశ్రీ - లవ్ రంజన్ ఇద్దరూ తమ సెట్ లలో కంగారు గా క‌నిపించారు. ఈ అల‌జ‌డిలో కొంద‌రు సిబ్బంది తప్పిపోయారని దీనిపై కొంత గందరగోళం ఉంద‌ని కూడా బాలీవుడ్ మీడియాలు క‌థ‌నం వెలువ‌రించాయి.

అయితే ఈ సంఘటన సమయంలో రణబీర్ కపూర్ లేదా శ్రద్ధా కపూర్ సినిమాల సెట్స్ లో లేరని తెలుస్తోంది. లవ్ రంజన్ - రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ మూవీ  సెట్ లో భారీత‌నం నిండిన‌ పాటలలో ఒకదాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ పాటలో 400 మంది డ్యాన్సర్లు పాల్గొనాల్సి ఉంది. ఇప్పటికే శ్రద్ధా కపూర్ తో పాటలోని కొంత భాగాన్ని చిత్రీకరించారు. అది మూవీలో శ్ర‌ద్ధా పరిచయ పాట. రణబీర్ కపూర్ 'షంషేరా' విడుదల తర్వాత సెట్స్ లో చేరాల్సి ఉండగా శ్ర‌ద్ధా అనారోగ్యానికి గురైంది. దీనివ‌ల్ల‌ షూటింగ్ నిలిపివేయవలసి వచ్చింది. అందువ‌ల్ల ప్ర‌మాద స‌మ‌యంలో సెట్స్ లో శ్ర‌ద్ధా కానీ ర‌ణ‌బీర్ కానీ ఉండే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.


Full View

Tags:    

Similar News