సెన్సేషనల్ హిట్స్ తో మెగా దర్శకుడిగానే వి.వి.వినాయక్ ఇన్నాళ్లు సుపరిచితం. కానీ ఆయనలో ఇలాంటి ఓ కొత్త కోణం ఉందని ఏనాడూ అభిమానులు ఊహించి ఉండరు. ఆయనను ఒక స్టార్ డైరెక్టర్ గా మాత్రమే అభిమానించిన అదే అభిమానులు ఇకపై తనని ఒక హీరోగా కూడా అభిమానించే టైమ్ స్టార్టయ్యింది.
ఇదిగో ఈ ఒక్క పోస్టర్ చాలు. వినాయక్ లో హీరో అవ్వాలన్న తపన గురించి చెప్పేందుకు. అంతగా హీరోయిక్ అప్పియరెన్స్ ఇప్పటికప్పుడే ఎలా సాధ్యం అనుకునేంత సర్ ప్రైజ్ ని ఇచ్చారు. తాను హీరో అవుతున్నాను! అని తలచినదే తడవుగా శరీరాకృతిని మార్చుకుని మేకోవర్ చూపించిన తీరు.. ఆ హార్డ్ వర్క్ చూస్తుంటే అన్నయ్య చిరంజీవి స్ఫూర్తి అని వేరే చెప్పాల్సిన పనేలేదు. మెగాస్టార్ స్ఫూర్తి ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. ఈ లుక్ లో మూడు రకాల షేడ్స్ వినాయక్ లో కనిపిస్తున్నాయి. ఒకటి ఫిట్ నెస్ - లుక్ కోసం మెగాస్టార్ ఎంతగా తపిస్తారో అంత తపన వినాయక్ లో కనిపిస్తోంది. రెండోది గ్యారేజ్ నుంచి అలా రెంచీతో వస్తుంటే జనతా గ్యారేజ్ ఓనర్ మోహన్ లాల్ లోని డెడికేషన్ కనిపిస్తోంది. ఆ మెడలో ఎర్ర కండువా చూశాక .. ఇంకెవరు గుర్తుకొస్తున్నారో ఒకసారి తరచి చూడండి. ఇంకెవరు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలో ఉపయోగించే ఎర్ర విప్లవం సింబల్ ఆ కండువా. మొత్తానికి వినాయక్ క్యారెక్టరైజేషన్ ని ఏ కోణంలో డిజైన్ చేశారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథాంశాన్ని ఎంచుకుని వినాయక్ బరిలో దిగారని అర్థమవుతోంది.
దిల్ సినిమాతో నిర్మాతగా తనకు లైఫ్ నిచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను దిల్ రాజు తీసుకున్నారు. దసరా లుక్ సందర్భంగా వినాయక్ `సీనయ్య` లుక్ ని రిలీజ్ చేశారు. టైటిల్ క్యాచీగా ఉంది. ఈ లుక్ కి అద్భుత స్పందన వస్తోంది. అక్టోబర్ 9 వినాయక్ బర్త్ డే సందర్భంగానూ ఈ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. వినాయక్ ఇలా స్ట్రెయిట్ గా రెంచీతో బరిలో దిగారు అనగానే అతడి పాత్ర ఒక మెకానిక్ అని అర్థమవుతోంది. దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు. వినాయక్ ని కథానాయకుడిగా పరిచయం చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఏమేరకు మెప్పిస్తారు అన్నది చూడాలి. ఇక వినాయక్ పై అభిమానంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ప్రకటనల్ని పత్రికల్లో గుప్పించారు ఆయనను అభిమానించే ట్రేడ్ వర్గాలు. ఒక స్టార్ హీరో రేంజు ఇంట్రడక్షన్ ఇదని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం మరో ప్లస్ కానుంది.