శ్యామ్ సింఘరాయ్: దీవాళి దివ్వెలు వెలుగులే వెలుగులు

Update: 2021-11-04 12:21 GMT
2021 దీపావ‌ళి దివ్వెలు వెలుగులు పంచేందుకు వ‌చ్చాయండోయ్. నేడు దీవాళి పండుగ‌ను పుర‌స్క‌రంచుకుని శ్యామ్ సింఘ‌రాయ్ నుంచి అందాల నాయిక‌లు సాయి పల్లవి- కృతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ లుక్ లను నాని విడుదల చేశారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా విడుద‌ల చేసిన లుక్ ల‌లో మడోన్నా - కృతి సాధారణ దుస్తులలో కనిపిస్తుండగా సాయి సాంప్రదాయ బెంగాలీ దుస్తులను ధరించారు. వారి రూపాన్ని పంచుకుంటూ.. ట్రైడెంట్ త్రిశూల చిహ్నం ఈమోజీని షేర్ చేశారు.

డిసెంబ‌ర్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దీపావ‌ళి మొద‌లు శ్యామ్ సింఘ‌రాయ్ ప్ర‌మోష‌న్ మొద‌లైన‌ట్టే. ఇక నెల‌రోజుల్లో విడుద‌ల ఉంది కాబ‌ట్టి వ‌రుస‌గా సింగిల్స్ టీజ‌ర్స్ ట్రైల‌ర్ అంటూ ప్ర‌చారం ఊపందుకోనుంది. వీ- ట‌క్ జ‌గ‌దీష్ ప‌రాజ‌యాల‌ త‌ర్వాత నానీ స‌రైన విజ‌యం కోసం వేచి చూస్తున్నారు. ఆ విజ‌యం శ్యామ్ సింఘ‌రాయ్ రూపంలో ద‌క్క‌నుందేమో చూడాలి.
Tags:    

Similar News