మెగా హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే సుబ్బు దర్శకత్వంలో ఈయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా షూటింగులు అన్నీ ఆగిపోయాయి. దీంతో అందరూ సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ ఇద్దరు మెగా హీరోలు కూడా ఈ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే రాబోయే ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కలవరపెడుతోందట. వివరాల్లోకి వెళ్తే వరుణ్ తేజ్ నటించే సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కఠోర వ్యాయామాలు చేసి మంచి ప్రొఫెషనల్ బాక్సర్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన వరుణ్ లాక్ డౌన్ కారణంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే వరుణ్ తేజ్ ఫిట్ నెస్ మీద ఫోకస్ చేయకుండా అధిక బరువు పెరుగుతున్నాడట. సినిమా షూటింగ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది కదా అప్పటికి మళ్ళీ వర్క్ ఔట్స్ స్టార్ట్ చేయొచ్చులే అని భావిస్తున్నాడట. దీంతో దర్శక నిర్మాతలు ఫిట్ నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని సూచించారట. షెడ్యూల్ ప్రారంభం అవకముందే తాను తిరిగి ఎప్పటిలాగే ఫిట్నెస్ సాధిస్తానని వరుణ్ తేజ్ నమ్మకంగా ఉన్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నదని సమాచారం. మరి ఆ లోపు మళ్ళీ వర్క్ ఔట్స్ చేసి బాక్సర్ అవతారమెత్తుతాడేమో చూడాలి.
మరో వైపు సాయి ధరమ్ తేజ్ కూడా బరువు పెరుగుతున్నాడట. 'రంగులరాట్నం' సినిమా కోసం బరువు పెరిగిన తేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమా కోసం మళ్ళీ బరువు తగ్గాడు. సో ఇప్పుడు బరువు పెరిగినా ఈజీగా వర్క్ ఔట్స్ చేసి మళ్ళీ ఫిట్ నెస్ సాధించగలనని ధీమాగా ఉన్నాడట. వాస్తవానికి దర్శక నిర్మాతలను వీరి బరువు గురించి ఆలోచించడానికి ప్రధాన కారణం సినిమాల్లోకి రాకముందు ఈ ఇద్దరు హీరోలు చాలా బొద్దుగా ఉండే వాళ్ళు. ఈ విషయాన్ని గతంలో ఈ హీరోలు చాలా సందర్భాలలో బయటపెట్టారు కూడా. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ డైట్ మెయింటైన్ చేయకుండా విపరీతంగా ఒళ్ళు చేస్తే మళ్ళీ అప్పుడు ఉన్నట్లే తయారవుతారనేది వారి భయం. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి ఫోటోలను చూసిన మెగా అభిమానులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ టైములో అందరు సెలబ్రెటీల లాగే మెగా హీరోలు వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ కూడా వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటే ఫిట్ నెస్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మరి మెగా హీరోలు ఇప్పటి నుండైనా ఫిట్ నెస్ మీద ఫోకస్ చేస్తారేమో చూడాలి.