ఉపయోగపడని కత్రినా బ్రేకప్

Update: 2016-02-15 13:18 GMT
రణ్ బీర్ కపూర్ తో కత్రినా కైఫ్ బ్రేకప్ అయిపోయిందన్నది పాత మాటే. రణ్ బీర్ వ్యవహారం నచ్చక.. ఆదిత్య రాయ్ కపూర్ తో నటించిన ఫితూర్ చిత్రంలో డోస్ బాగానే పెంచింది కత్రినా. అప్పటికే అటూ ఇటూగా ఉన్న వ్యవహారం - ఫితూర్ లో కేట్ చిందులతో మొత్తానికి అటకెక్కేసింది. దీంతో ఇప్పుడిద్దరూ ఫ్రీ అయిపోయారు కానీ.. కేట్ బ్రేకప్ వ్యవహారం ఫితూర్ సక్సెస్ కి ఉపయోగపడుతుందని అందరూ భావించారు.

అనూహ్యంగా ఫితూర్ మాత్రం బాక్సీఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. వేలంటైన్స్ డే స్పెషల్ గా వచ్చిన ఈ మూవీ.. ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది. దీనితో పాటే వచ్చిన సనమ్ రేకి కూడా బ్యాడ్ టాక్ ఉన్నా.. ఆ మూవీ మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోనుండగా.. ఫితూర్ మాత్రం డిజాస్టర్ గా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. పుల్కిత్ సామ్రాట్ - యామీ గౌతమ్ లు నటించిన సనమ్ రే ను 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. తొలి మూడు రోజుల్లో ఈ మూవీ 16 కోట్ల వరకూ రాబట్టేసింది. ఫుల్ రన్ 20కోట్లు రాబట్టడం దీనికి పెద్దగా కష్టం కాదు.

కానీ ఫితూర్ చిత్రాన్ని ఆదిత్యా రాయ్ కపూర్ - కత్రినా - టబు వంటి భారీ తారాగణంతో నిర్మించారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా పది కోట్లు కూడా రాబట్టలేదు. దీనికి తోడు కలెక్షన్స్ డ్రాప్ అవడంతో.. చాలా స్క్రీన్ల నుంచి తొలగించేస్తున్నారు. ఫుల్ రన్ లో గట్టిగా 20 కోట్లు వచ్చినా గొప్పే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇక ఫితూర్ కోలుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదన్నది బాలీవుడ్ టాక్.
Tags:    

Similar News