ప్లాష్‌ బ్యాక్‌ : అప్పుడు స్టార్స్‌ పని ఎక్కువ పారితోషికం తక్కువ

Update: 2021-07-05 09:30 GMT
టాలీవుడ్‌ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా 1980 మరియు 90 ల్లో ఒక్కో హీరో అయిదు నుండి పది సినిమాల వరకు ఏడాదిలో విడుదల చేసేవారు. అప్పట్లో ఒక్కో సినిమాను రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో సినిమాను ఏకంగా ఏళ్లకు ఏళ్లు తెరకెక్కిస్తున్నారు. అప్పుడు క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీకి చాలా మార్పులు అయితే వచ్చాయి.. కాని సినిమా లు సంఖ్య మాత్రం చాలా తగ్గింది. రాజమౌళి.. శంకర్‌ వంటి స్టార్ డైరెక్టర్స్ అద్బుతమైన సినిమాలను తీస్తున్నారు. కాని వారు ఆ సినిమాలను తీసేందుకు రెండు మూడు ఏళ్లు అంతకు మించి సమయం తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ ఏయన్నార్‌ వంటి స్టార్స్ ఒకానొక సమయంలో ఏడాదికి అయిదు పది సినిమాలను కూడా విడుదల చేశారు. చిరంజీవి బాలయ్య జనరేషన్‌ హీరోలు కూడా పెద్ద మొత్తంలో సినిమాలు చేశారు. అప్పట్లో హీరోలు ఒకే రోజు రెండు మూడు షిప్ట్‌ ల వర్క్‌ చేసేవారు. ఉదయం ఒక సినిమా.. మద్యాహ్నం ఒక సినిమా రాత్రి ఒక సినిమా అంటూ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయంటూ అప్పటి హీరోలు చెబుతూ ఉంటారు. కాని ఇప్పుడు మాత్రం ఒక్క రోజులో ఒక హీరో ఒక సినిమా షూటింగ్‌ లో మాత్రమే పాల్గొంటాడు. ప్రస్తు పరిస్థితుల్లో షిప్ట్‌ ల వారిగా హీరోలు నటించే పరిస్థితి లేదు. షూటింగ్‌ చాలా మెల్లగా సాగుతుంది. తద్వారా ఇతర సినిమాలు కమిట్ అవ్వడం చాలా ఆలస్యం అవుతుంది.

ఎన్టీఆర్‌ ప్రతిష్టాత్మక సినిమా లు ఎన్నో కూడా రెండు మూడు నెలల్లోనే పూర్తి అయ్యాయి అంటూ ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత వ్యాఖ్యలు చేశాడు. ఆయన కెరీర్‌ లో ఒక సూపర్‌ హిట్ సినిమాకు గాను 30 రోజుల డేట్లు ఇచ్చాడు. అందుకు గాను లక్ష పారితోషికంను అందుకున్నారు. అప్పట్లో ఆ సినిమా భారీ బడ్జెట్‌ మూవీగా ఆయన చెప్పుకొచ్చాడు. అయినా కూడా కొన్ని రోజుల్లోనే ముగించారు. అలాంటి రోజులు ఇప్పుడు లేవు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అప్పటి హీరోలు ఎంత కష్టపడ్డా తక్కువ పారితోషికం వచ్చేది. అప్పట్లో లక్షల పారితోషికం తీసుకుంటే బాబోయ్‌ అనేవారు. పారితోషికం విషయంలో గత ఇరవై ఏళ్లుగా మాత్రమే కోట్లు ఇస్తున్నారు. పారితోషికం పెరిగిన తర్వాత హీరోలు సినిమాల సంఖ్య తగ్గించారు. తక్కువ పారితోషికం వచ్చిన సమయంలో ఎక్కువ సినిమాలు చేసే వారు  కాని ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాకు కోట్లు వస్తున్న కారణంగా వారు మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ముందు ముందు అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.
Tags:    

Similar News