ఇక ఫోకస్ అంతా ఆ సినిమా మీదే

Update: 2016-12-24 05:17 GMT
ఈ వీకెండ్లో ఒకేరోజు తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైపోయాయి. అందులో హిందీ డబ్బింగ్ మూవీ ‘దంగల్’ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘వంగవీటి’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ పర్వాలేదనిపిస్తోంది. ‘ఒక్కడొచ్చాడు’ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ‘పిట్టగోడ’పై పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమా రిజల్ట్ ఏంటో ఈ రోజు తేలుతుంది. ఇది ఎంతయినా చిన్న సినిమా. ఇక తెలుగు ప్రేక్షకుల ఫోకస్ తర్వాతి వారం మీదికి వెళ్లిపోయింది. ఏడాది చివరి వీకెండ్లో రాబోతున్న సినిమాల్లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఉంది. అదే.. అప్పట్లో ఒకడుండేవాడు.

90ల నాటి బ్యాక్ డ్రాప్ లో.. అప్పటి వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. దీని టైటిల్.. ఫస్ట్ పోస్టర్.. టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా విపరీతమైన ఆసక్తిని కలిగించాయి. సెన్సేషనల్ కంటెంట్ ఉన్న సినిమాలాగా కనిపించింది ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ‘అయ్యారే’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర.. ఈసారి కొత్తదనం అందిస్తూనే కమర్షియల్ సక్సెస్ కూడా అందుకునేలా కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన సినిమాలు చేసే నారా రోహిత్.. ఈసారి శ్రీవిష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ అంటున్నాడు. చాలా క్రియేటివ్ గా కనిపిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదికి మంచి ముగింపును ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 30న ఈ చిత్రంతో పాటు ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే ఆ సినిమా విడుదలపై మరోసారి డైలమా నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News