ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్ 2020న అకాల మరణం చెందారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా వివాదాలు చెలరేగాయి. ఇందులో డ్రగ్స్ కోణం దుమారం రేపింది. కానీ అతను చనిపోయి కనిపించిన అపార్ట్ మెంట్ ఇప్పటికీ ఖాళీగా ఉందని తెలిసింది. ఇంటి యజమాని అద్దెదారుని కనుగొనడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫ్లాట్ గత చరిత్ర కారణంగా ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలిసింది.
సుశాంత్ సింగ్ మరణించిన రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా అద్దెదారుని కనుగొనడంలో విఫలమవ్వడం నగరంలో చర్చకు వస్తోంది. అద్దెకు దిగేవాళ్లు సుశాంత్ మరణించిన అదే అపార్ట్ మెంట్ అని వినగానే.. కనీసం ఫ్లాట్ ను కూడా సందర్శించకుండా వెనక్కి వెళ్లిపోతున్నారట. నిజానికి సీ-వ్యూతో అపార్ట్ మెంట్ అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇంకా అద్దెదారుని కనుగొనలేదని ఇటీవల సండే టైమ్స్ లో ఓ కథనం వెలువడింది. సుశాంత్ సింగ్ ఈ ఫ్లాట్ లోనే మరణించాడని తెలుసుకున్న వెంటనే కొనుగోలుదారులు వెనక్కి తగ్గారని సదరు కథనం పేర్కొంది. ఇది ముంబైలోని బాంద్రా వెస్ట్ మోంట్ బ్లాంక్ భవనం ఆరవ అంతస్తులో ఉంది. ఇది 4BHK -టెర్రేస్ తో కూడిన సీ-ఫ్రంట్ డ్యూప్లెక్స్.
రియల్ ఎస్టేట్ బ్రోకర్... ప్రఖ్యాత యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్ అయిన రఫీక్ మర్చంట్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఫ్లాట్ కి సంబంధించిన ఫోటోల కోల్లెజ్ ను వీడియో రూపంలో షేర్ చేసారు. ఫ్లాట్ నెలకు 5 లక్షలతో అద్దెకు అందుబాటులో ఉందని తన ఫాలోవర్స్ కి తెలియజేసారు. ఈ ఫ్లాట్ ని ఇంకా ఎందుకు అద్దెకు ఇవ్వలేకపోయారో కూడా అతను వివరించాడు. నిజానికి ప్రజలు ఈ ఫ్లాట్ లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. సుశాంత్ సింగ్ మరణించిన అపార్ట్ మెంట్ ఇదే అని అద్దెదారులు విన్నప్పుడు వారు ఫ్లాట్ ను కూడా సందర్శించడం లేదు. ఇప్పటికి ఆ మరణవార్త పాతబడిపోవడంతో కనీసం ఫ్లాట్ ని సందర్శిస్తున్నారు. అయితే ఒప్పందం ఖరారు కాలేదు.. అని తెలిపారు.
``దీనికి తోడు ఇంటి యజమాని కూడా నరకాసురుడు. ఎవరైనా అద్దెకు దిగడానికి ఇష్టపడడు. అతను అలా చేస్తేనే త్వరగా అమ్మేయడం సాధ్యం అని అంటాడు. అతడు దానిని మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తుండడంతో చాలామంది అదే ప్రాంతంలో ఇతర ఫ్లాట్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఈ ఫ్లాట్ తో సంబంధం ఉన్న వివాదాలతో పని లేకుండా కొత్తది కొనుక్కోవడం ఉత్తమమని భావిస్తున్నారు`` అని అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివశించిన ఫ్లాట్ ఇదేనని అద్దె పార్టీలకు చెబుతున్నారా? అని ప్రశ్నిస్తే.. ఈ విషయాన్ని ముందే పార్టీలకు చెబుతున్నారట. ఇందులో దాచడానికి ఏదీ లేదు. ముందే తెలియాలి. కొంతమంది చరిత్రను పట్టించుకోరు.. ఫ్లాట్ చూడాలని కోరుకుంటారు. కానీ వారి స్నేహితులు కుటుంబ సభ్యులు డీల్ తో ముందుకు వెళ్లకుండా వారిని నిరుత్సాహపరుస్తారు. ఒక ఎన్నారై అయిన ఫ్లాట్ యజమాని ఇప్పుడు తన ఫ్లాట్ ను సినిమా తారలకు అద్దెకు ఇవ్వడంపై జాగ్రత్త వహించడంలో ఆశ్చర్యం లేదని కూడా రఫీక్ మర్చంట్ వెల్లడించాడు. ``ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సినీ ప్రముఖులకు ఫ్లాట్ ను అద్దెకు ఇవ్వడానికి యజమాని ఇష్టపడడం లేదు.
అతను ఫ్లాట్ ను ఒక కార్పొరేట్ వ్యక్తికి అప్పగించాలను కుంటున్నట్లు స్పష్టంగా చెప్పాడని తెలిపారు. నిజానికి నేను ఫ్లాట్ వీడియోను కూడా తీయడానికి ప్రతిపాదించాను. కానీ యజమాని ఆందోళన చెందాడు. అందుకే నేను ఫోటోగ్రాఫ్ లను మాత్రమే అప్ లోడ్ చేసాను. దాని నుండి వీడియోను రూపొందించాను`` అని వెల్లడించారు. సదరు యూట్యూబర్ త్వరలోనే డీల్ పూర్తవుతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా ఫ్లాట్ అద్దెకు ఉందని కోవిడ్ సంక్షోభం కారణంగా దీనికి అద్దెదారు దొరకడం లేదని కథనాలొచ్చాయి. అప్పుడు ప్రచురించబడిన వార్తా కథనాల ప్రకారం... సుశాంత్ డిసెంబర్ 2019 లో 3600 చదరపు అడుగుల మాంట్ బ్లాంక్ అపార్ట్ మెంట్ లోకి మారాడు. అతను నెలకు 4.51 లక్షలు చెల్లించేవాడు. ఆ ఫ్లాట్ లో బలవన్మరణం సంభవించిందని తెలిసినా కూడా యజమాని అద్దెను పెంచాడే కానీ తగ్గించలేదు. రూ.5లక్షలు చెల్లిస్తేనే అతడు ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకోవడం ఇక్కడ గమనించదగిన ట్విస్టు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.