న‌న్ను క్ష‌మించండిః స‌ల్మాన్ ఖాన్‌

Update: 2021-05-12 13:30 GMT
స‌ల్మాన్ ఖాన్ అప్ క‌మింగ్ మూవీ 'రాధే'. రంజాన్ టార్గెట్ గా ఎప్పుడో స్లాట్ బుక్ చేసుకున్న ఈ మూవీ.. రేపు విడుద‌ల కాబోతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ నిర్మాత‌లూ చేయ‌ని సాహ‌సానికి కూడా సిద్ధ‌మైంది 'రాధే' టీమ్‌.  ఈ మూవీని ఒకే రోజు అటు థియేట‌ర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే.. ఈ సినిమా రిలీజ్ ప్ర‌క‌టించే స‌మ‌యంలో క‌రోనా ఇంత ఉధృతంగా లేదు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. నిత్యం 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు మొత్తం దాదాపుగా మూత‌ప‌డిపోయిన ప‌రిస్థితి. దీంతో.. థియేట్రికల్ రిలీజ్ అసాధ్యంగా మారిపోయింది. అయితే.. సినిమాను మాత్రం వాయిదా వేయ‌లేక‌పోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు స‌ల్మాన్‌.

ఈ విష‌య‌మై హీరో మాట్లాడుతూ.. ''ప్ర‌తీ రంజాన్ పండుగ వేళ నా సినిమా రిలీజ్ చేయ‌డం నాకు సెంటి మెంట్‌. అందుకే.. ఈ సారి కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ.. థియేట‌ర్లో రిలీజ్ చేసే ఛాన్స్ లేక‌పోయింది. జీ సంస్థ‌, నా ఫ్యాన్స్ స‌హ‌కారంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. క‌రోనా విషాద ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు కాస్త వినోదం అందించాలని అనుకున్నాను.'' అని చెప్పారు సల్మాన్.

ఈ సందర్భంగా సినిమా థియేటర్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పారు. థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఓటీటీకి వెళ్తున్న‌ట్టు చెప్పారు. ''ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు చాలా ప్ర‌య‌త్నించాం. ప‌లుమార్లు వాయిదా వేశాం. కానీ.. కుద‌ర‌లేదు. క్షమించండి.'' అని అన్నారు సల్మాన్. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పారు.
Tags:    

Similar News