రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ముందుకొస్తున్న మాజీ స్టార్ హీరోయిన్స్...!
కంటికి కనిపించని ఒక మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ ఎంతటి అవస్థలు పడుతుందో మనం చూస్తేనే ఉన్నాం. దీని మూలంగా రెండు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని రంగాలపై మినహాయింపులు ఇస్తున్నా సినిమాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితి నుండి చిత్ర పరిశ్రమ బయటపడటానికి చాలా కాలమే పట్టేట్లు ఉందని అర్థం అవుతోంది. అయితే దీని వలన నిర్మాతలు ఇంకా కష్టనష్టాలు అనుభవించనున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మేర నష్టపోయిన నిర్మాతలు భవిష్యత్ లో అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి.
బడ్జెట్ లో కోతలు విదించుకుంటూ.. హీరో హీరోయిన్స్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అంతో ఇంతో నిర్మాతలు బయటపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ కి ఇది కాస్త ఇబ్బంది కలిగించినా మరికొందరికి మాత్రం ఇది వరంలా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ హోదాలో కొనసాగుతున్నవారు హీరోలు తీసుకునే దాంతో పోలిస్తే చాలా తక్కువ తీసుకుంటున్నారు. అందుకే వారికి తమ పారితోషకాన్ని తగ్గించుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగొంది ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు రాని వారికి మాత్రం ఇది మంచి చేసే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఒకప్పుడు కోట్లు తీసుకున్న వారు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు ఈ క్రైసిస్ ని అడ్డం పెట్టుకొని తమ మేనేజర్ల ద్వారా పారితోషకాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రొడ్యూసర్స్ కి ఇంఫార్మ్ చేస్తున్నారట. ఇలా అయినా మళ్ళీ టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ ఆల్రెడీ రెమ్యూనరేషన్స్ లో కోతలు విదించుకున్నట్లు ప్రొడ్యూసర్స్ కి న్యూస్ చేరవేశారట. దీంతో స్టార్ హీరోయిన్స్ పారితోషకం తగ్గించుకోకపోతే ప్రొడ్యూసర్స్ వీరివైపు చూసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా వారికి టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోడానికి మంచి అవకాశమనే చెప్పొచ్చు. నిర్మాతలు కూడా బడ్జెట్ తగ్గించడం కోసం తక్కువకే అందుబాటులో ఉండే హీరోయిన్స్ దిశగా ఆలోచిస్తారు. సో అలాంటి హీరోయిన్స్ కి ఈ క్రైసిస్ సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతోందన్నమాట.