తెలుగులో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటే అందులో చంద్రశేఖర్ యేలేటి పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇప్పుడు అందరూ కమర్షియల్ సక్సెస్ నే ప్రధానంగా చూస్తున్నారు కాబట్టి మెజారిటీ హీరోలు హిట్స్ ఇచ్చే దర్శకుల వెంటబడుతున్నారు. అందుకే మాస్ మసాలా డైరెక్టర్లకు ఉండే డిమాండ్ యేలేటి లాంటి ఫిలిం మేకర్స్ కు లేదు.
యేలేటి చివరి సినిమా 'మనమంతా' కు మంచి రివ్యూస్.. విమర్శకులనుండి ప్రశంసలు లభించాయిగానీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అనిపించుకోలేదు. దీంతో సహజంగానే ఆ ఇంపాక్ట్ తన నెక్స్ట్ సినిమాపై పడింది. యేలేటి ఒక మంచి కథ రెడీ చేసుకొని ఉన్నా హీరో మాత్రం సెట్ కావడం లేదు. మొదట తన కథను సాయిధరమ్ తేజ్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. కానీ తర్వాత తేజూ డ్రాప్ కావడంతో నాని లైన్లోకొచ్చాడు. నాని కూడా తప్పుకోవడంతో ఆ కథ నితిన్ దగ్గరకు వెళ్ళింది. తాజా సమాచారం ఏంటంటే ఈ సినిమాను నితిన్ కూడా చేయడం లేదట.
రానా దగ్గుబాటి ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారట. యేలేటి కి రానా లాంటి నటుడు దొరకడం లక్కీనే గానీ ఈ హీరోతో అయినా సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలని కోరుకుందాం.