కెరీర్లో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయానికి రెడీ అయిపోతున్నాడు. ‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో మూడు పాత్రల్లో దర్శనమివ్వబోతున్నాడు తారక్. ఇది మూడు షేడ్స్ ఉన్న ఒక పాత్ర కాదు. మూడు వేర్వేరు పాత్రలే. ఆ మూడు పాత్రలకూ ముగ్గురు హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. స్టార్ హీరోయిన్ కాజల్ తో పాటు.. అప్ కమింగ్ హీరోయిన్లు నివేదా థామస్ - అనుపమ పరమేశ్వరన్ ఈ మూడు పాత్రల్ని పోషిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా కనిపిస్తుందట.
‘జనతా గ్యారేజ్’లో కాజల్ తరహాలోనే ఒక స్టార్ హీరోయిన్‌తో ఐటెం సాంగ్ కోసం ప్లాన్ చేశాడట బాబీ. అలా చూసుకుంటే ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు దర్శనమిస్తారన్నమాట. వరుసగా టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ఈసారి మాస్ టచ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు సమాచారం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫెయిల్యూర్లో తన పాత్ర పరిమితం అయినప్పటికీ బాబీ మీద ఫ్లాప్ డైరెక్టర్ అన్న ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో తనేంటో రుజువు చేసుకోవాలని పట్టుదలతో ఉన్న బాబీ.. తన రచనా సామర్థ్యాన్నంతా ఉపయోగించి పక్కా కమర్షియల్ స్క్రిప్టు రెడీ చేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/