ప్రభాస్.. ఆ కథకు దేవుడట

Update: 2018-01-22 10:10 GMT
అభిమాన హీరోల్ని అభిమానులు దేవుళ్లలా భావించడం మామూలే. కొందరు చిన్న స్థాయి యాక్టర్స్ కూడా పెద్ద తారల్ని దేవుళ్లుగా కీర్తిస్తుంటారు. ఐతే ఇప్పుడు ఒక పేరున్న దర్శకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను దేవుడిగా కీర్తించేశాడు. అతనెవరో కాదు.. ప్రభాస్ స్నేహితులు వంశీ-ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’కి దర్శకత్వం వహించిన జి.అశోక్. ‘భాగమతి’ని తెరకెక్కించడానికి తనది ఐదేళ్ల పోరాటం అని.. ఐతే ఈ సినిమా తెరమీదికి వచ్చిందంటే అది ప్రభాస్ పుణ్యమే అని అశోక్ అన్నాడు. తాను ఈ కథను ముందుగా చెప్పింది ప్రభాస్ కే అని.. అతనే అనుష్క.. యువి క్రియేషన్స్ అధినేతలకు చెప్పి ఈ సినిమా ఓకే చేయించాడని అశోక్ తెలిపాడు.

మామూలుగా కష్టపడితే విజయం దక్కుతుందని.. కానీ ఎలాగైనా గెలవాలి అనుకున్నపుడు మోసం మొదలవుతుందని.. కానీ తాను గెలుస్తూ మిగతా వాళ్లు కూడా గెలవాలని అని కోరుకుంటే దైవత్వం వస్తుందని.. ఆ రకంగా ఆలోచిస్తాడుు కాబట్టే ప్రభాస్ తనకు దేవుడిలా కనిపించాడని అశోక్ తెలిపాడు. ప్రభాస్ దేవుడిలా నిలిచి ఈ సినిమా పట్టాలెక్కడానికి సాయం చేస్తే.. ‘యువి క్రియేషన్స్’ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీ త్రిమూర్తుల్లా దాన్ని నడిపించారని.. అనుష్క అనే శక్తి ‘భాగమతి’ని అభినయించి ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణమైందని అశోక్ తెలిపాడు. అనుష్క ఈ సినిమాకు పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని.. అంత కమిట్మెంట్ ఉన్న నటిని తాను చూడలేదని.. ‘భాగమతి’ ఆమె కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని అశోక్ అన్నాడు.
Tags:    

Similar News