నిన్న విడుదలైన వాల్మికి ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ లుక్ చూసి అందరూ షాక్ తిన్నారు. రఫ్ గా ఉంటాడని తెలుసుకానీ మరీ ఇంత రగ్డ్ అవతారం మాత్రం ఎవరూ ఊహించనిది. ఎఫ్2లో సరదాగా అల్లరి చేసింది ఈ కుర్రాడేనా అని అనుమానం వచ్చేలా హరీష్ శంకర్ చాలా బాగా డిజైన్ చేయించాడు. ఇదో స్ట్రెయిట్ మూవీ అయ్యుంటే ఈ పాత్రలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయనే కుతూహలం ఎక్కువగా ఉండేది.
కానీ రీమేక్ కావడంతో ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండా చూసిన వాళ్లకు దాని స్వభావం బాగా గుర్తే. అందుకే గెటప్ బాగానే ఉంది కానీ సరదాగా కనిపించే రౌడీ డాన్ పాత్ర ను ఇంత సీరియస్ గా మార్చారే అనే అనుమానం మాత్రం అందరికి వస్తోంది. తమిళ్ లో ఈ రోల్ బాబీ సింహా చేశాడు. ఇంత నాటుగా దాని చిత్రణ ఉండదు.
ఇక్కడ వచ్చే సందేహాల వెనుక ఇంకో క్లారిటీ కూడా కనిపిస్తోంది. హరీష్ శంకర్ గతంలో పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ ల్యాండ్ మార్క్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదీ రీమేకే. కానీ పవన్ ఇమేజ్ కు తగ్గట్టు చేసిన మార్పులు హీరోయిజం ఇంకా బాగా ఎలివేట్ అయ్యేలా రాసుకున్న డైలాగులు దాని లెవల్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. వాల్మీకి కూడా అదే సూత్రాన్ని ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది.
ఒరిజినల్ కన్నా బాగా తెలుగు రీమేక్స్ జరగడం చాలా అరుదు. అందులో గబ్బర్ సింగ్ ది ప్రత్యేక స్థానం. ఇప్పుడు వాల్మీకిని కూడా అదే తరహాలో తీర్చిదిద్దే హామీతోనే వరుణ్ ని హరీష్ శంకర్ ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఏదైతేనేం మొత్తానికి షాకింగ్ లుక్ తో వరుణ్ దర్శనం కొత్త అంచనాలకు దారి తీసింది. సెప్టెంబర్ విడుదల కానున్న వాల్మీకిలో హీరో తరహా ఇంకో పాత్రను అధర్వ చేస్తున్న సంగతి తెలిసిందే