ఎటాక్ పాట వెనుక ఆస‌క్తిక‌ర క‌థ‌

Update: 2016-03-22 15:30 GMT
‘‘కొట్టినా.. పొడిచినా.. ఉప్పు పాతరేసినా..ప్రాణమే తీసినా.. గొయ్యి తవ్వి పాతినా’’... ఇదీ రామ్ గోపాల్ వ‌ర్మ కొత్త సినిమా ‘ఎటాక్’ లోని పాట‌. ఇలాంటి పాట‌లు రాయించ‌డం వ‌ర్మ‌కు మాత్ర‌మే సాధ్యం. గ‌త కొన్నేళ్లుగా వ‌ర్మ ఆస్థాన గీత ర‌చ‌యిత‌గా ఉన్న సిరాశ్రీ ఈ పాట రాశాడు. ఐతే ఈ పాట ఇలా రాయించ‌డానికి చిరంజీవే స్ఫూర్తి అంటున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. చిరు సినిమా ‘మ‌ర‌ణ‌మృదంగం’లోని ‘‘కొట్టండి గిల్లండి  కొయ్యండి చంపండి ప్రేమ’’.. అనే పాట స్ఫూర్తితో అటాక్‌లో పాట రాయించిన‌ట్లు చెప్పాడు వ‌ర్మ‌. ఐతే చిరు సినిమాలోని రొమాంటిక్ సాంగ్ స్ఫూర్తితో ఇలాంటి వ‌యొలెంట్ యాంగిల్లో పాట రాయించ‌డం వ‌ర్మ‌కే చెల్లింది.

ఈ పాట‌కు సంబంధించిన మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. దీన్ని ప్ర‌ముఖ గ‌జ‌ల్స్ గాయ‌కుడు గ‌జ‌ల్స్ శ్రీనివాస్ పాడాడు. ఆయ‌న పాడిన తొలి సినిమా పాట ఇదే. సినిమా పాట‌లు పాడ‌కూడ‌ద‌న్న త‌న నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌బెట్టి ఈ పాట గానం చేయ‌డానికి కార‌ణం కూడా చెప్పాడు గ‌జ‌ల్స్ శ్రీనివాస్‌. ‘‘ఒక రోజు సిరాశ్రీ ఫోన్ చేసి వ‌ర్మ గారి సినిమాకి మీరు పాడాలి అన్నాడు. నేను వ‌ర్మ అభిమానిని..ఐతే ఆయన పాట ఎలా ఉంటుందో.. ఏం పాడాలో నాకు తెలియంది కాదు. దేవాల‌యాల కోసం ఉద్య‌మం చేస్తున్న‌వాడిని నా నోటితో వ‌ర్మ స్టైల్లో   న‌ర‌కాలి.. చంపాలి.. అనే ప‌దాల‌తో ఎలా పాట పాడ‌ను అని చెప్పాను. సిరాశ్రీ ఒక‌సారి నేను రాసిన పాట చ‌దవండి అన్నాడు ఆయ‌న పాట రాసిన విధానం న‌చ్చి ఈ పాట పాడాను’’ అని శ్రీనివాస్ చెప్పాడు.
Tags:    

Similar News