వండర్ ఉమన్ రెమ్యూనరేషన్ వండరే

Update: 2017-06-22 10:01 GMT
హాలీవుడ్ సినిమాల్లో ఈ ఏడాది బంపర్ హిట్ కొట్టింది వండర్ ఉమన్ సినిమా. ఈ సినిమా అనుకున్న స్థాయికి మించి కలెక్షన్లు సాధిస్తోంది. ఇంతవరకు ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిలిం ప్రపంచ వ్యాప్తంగా 580 మిలియన్ డాలర్లు (రూ. 3,800 కోట్లు) కొల్లగొట్టింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను ఇజ్రాయిల్ కు చెందిన 32 ఏళ్ల గాల్ గడోట్ పోషించింది. వండర్ ఉమన్ లో గాల్ గడోట్ స్టంట్స్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచాయి.

ఇంత బ్రహ్మాండమైన హిట్ సినిమాకు గాల్ గడోట్ అందుకున్న పారితోషికం 3 లక్షల యూఎస్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే రూ. 1.8 కోట్లు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్లుగా ఫామ్ లో ఉండేవారు తీసుకుంటున్న మొత్తం రూ. 2 కోట్లపైనే. నిన్న, మొన్నటి వరకు నయనతార, కాజల్ ఈ రేంజ్ లోనే ఛార్జ్ చేసేవారనేది ఫిలిం నగర్ వర్గాల మాట. సమంత, రకుల్ ప్రీత్ రూ. 1.5 కోట్లకు పైగా తీసుకుంటున్నారనేది టాక్. రూ 20 కోట్ల బడ్జెట్ లో తీసుకునే సినిమాకే వీళ్లు ఈ రేంజిలో తీసుకుంటుంటే రూ. 3,800 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమా హీరోయిన్ కి దాదాపుగా అంతే రెమ్యునరేషన్ ఇవ్వడం విశేషం.  

గల్ గడొట్ కు ఇంత తక్కువ పారితోషికం ఇవ్వడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. సోషల్ మీడియా ద్వారా ఫిలిం మేకర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే వండర్ ఉమెన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు. ఈసారి ఆమెకు రూ. 50 కోట్ల నుంచి రూ. 70 రెమ్యునరేషన్ లభించే అవకాశముంది. అంతే... ఇండస్ట్రీలో ఫేట్ మారిపోవడానికి ఒక్క హిట్ చాలు. అది టాలీవుడ్ అయినా.. హాలీవుడ్ అయినా ఒకటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News