మూడు రోజుల్లో ‘గరుడవేగ’ ఎంత తెచ్చింది?

Update: 2017-11-06 16:21 GMT
గత శుక్రవారం పాజిటివ్ టాక్ తో మొదలైంది ‘గరుడవేగ’ సినిమా. తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. రెండో రోజు నుంచి బాగా పుంజుకున్నాయి. శని.. ఆది వారాల్లో థియేటర్లు.. స్క్రీన్లు పెరిగాయి. కలెక్షన్లు కూడా పెరిగాయి. ముందు వారాల్లో వచ్చిన పాత సినిమాల జోరు తగ్గిపోవడం.. పోటీగా వచ్చిన కొత్త సినిమాలు తేలిపోవడంతో ప్రేక్షకులకు ‘గరుడ వేగ’నే ఫస్ట్ ఛాయిస్ అయింది. దీంతో తొలి రూ.70 లక్షల లోపు ఉన్న ‘గరుడవేగ’ షేర్ వీకెండ్ అయ్యేసరికి రూ.3.2 కోట్లకు చేరింది. ఇది ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినా ఈ సినిమా ఇంకా చాలానే వసూలు చేయాల్సి ఉంది. ఈ చిత్ర బడ్జెట్ రూ.25 కోట్లపైనే అంటుండగా.. సరైన బిజినెస్ ఆపర్లు లేకపోవడంతో థియేట్రికల్ హక్కుల్ని రూ.11 కోట్లకే అమ్మినట్లు సమాచారం.

ఏరియాల వారీగా తొలి వారాంతంలో ‘గరుడవేగ’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..

నైజాం- రూ.95 లక్షలు

వైజాగ్- రూ.30 లక్షలు

తూర్పు గోదావరి- రూ.20 లక్షలు

పశ్చిమ గోదావరి- రూ.11 లక్షలు

కృష్ణా- రూ.19 లక్షలు

గుంటూరు- రూ.24 లక్షలు

నెల్లూరు- రూ. 6 లక్షలు

సీడెడ్- రూ.30 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.2.35 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ. 4.25 కోట్లు

కర్ణాటక- రూ.15 లక్షలు

యుఎస్- రూ.60 లక్షలు

మిగతా ఏరియాల్లో- రూ. 10 లక్షలు

వరల్డ్ వైడ్ షేర్- రూ3.2 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.6.65 కోట్లు
Tags:    

Similar News