సూపర్ స్టార్ మహేష్ ఛామింగ్ లుక్ ఆయన ఏజ్ అన్నివేళలా హాట్ టాపిక్ గా మారుతోంది. తనయుడు గౌతమ్ కృష్ణకు ఒక బ్రదర్ ఉండి ఉంటే ఇలా ఉంటాడా? అంటూ అభిమానులు ప్రతిసారీ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. అంతగా కాలేజ్ బోయ్ రూపానికి మారిపోతూ మహేష్ 46 ఏజ్ లో సర్ ప్రైజ్ ఇస్తున్న తీరు షాకిస్తోంది.
రాఖీ సందర్భంగా రివీల్ చేసిన ఓ ఫోటోలో మహేష్ తనయుడు గౌతమ్ పెద్ద వాడు అవుతున్నాడని అర్థమవుతోంది. అతడు బాల నటుడిగా మునుముందు బరిలో దిగాల్సి ఉంటుందని ఘట్టమనేని అభిమానులు తలపోస్తున్నారు. మహేష్ ఈ ఏజ్ నుంచే నటుడిగా నిరూపించుకున్నారు. కొడుకు దిద్దిన కాపురం లాంటి క్లాసిక్ హిట్ మూవీలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రకంగా మహేష్ బాలనలుడిగా చిచ్చర పిడుగు అనిపించారు. ఇక గౌతమ్ రాక అటుంచితే.. అల్లరి సితార ఎలానూ ఇప్పటికే సెలబ్రిటీగా అంతర్జాలాన్ని ఏలేస్తోంది. యూట్యూబ్ సోషల్ మీడియా క్వీన్ గా టీచర్ గా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతోంది. అసాధారణ స్టార్ డమ్ తో వెలిగిపోతున్న మహేష్ లెగసీని ముందుకు నడిపించేది ఎవరు ఆ ఇద్దరిలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున మహేశ్ లేదా నమ్రత తమ వారసులైన గౌతమ్ - సితార ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా గౌతమ్ - సితార కలిసి ఉన్న ఫోటోని రాఖీ కట్టి ఆనందంగా ఫోజులిచ్చిన వైనాన్ని ఈ ఫోటోతో వెల్లడించారు. సాంప్రదాయ దుస్తులలో ఆ ఇద్దరూ ఎంతో ముద్దొచ్చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. మహేష్ ఫిలింనగర్ గృహంలో రాఖీ పండుగను జరుపుకున్నారని ఆ దృశ్యం క్లారిటీగా చెబుతోంది.
సూపర్ స్టార్ మహేష్ తదుపరి వరుసగా సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇతర స్టార్లతో పోటీపడుతూ ఆయన తదుపరి చిత్రాలను ప్రకటించేందుకు వేచి చూస్తున్నారు. పరశురామ్ తో సర్కారు వారి పాట చిత్రం పూర్తవుతోంది. ఇది 2022 సంక్రాంతికి రిలీజవుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
టాలీవుడ్ లో ఒకే ఒక్కడిగా రికార్డ్..
సూపర్ స్టార్ మహేష్ ఎంపికలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడున్న హీరోలంతా పాన్ ఇండియా పిచ్చితో భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తుంటే మహేష్ మాత్రం కూల్ గా తన పనిలో తాను ఉన్నారు. ఆయన మార్గం మాత్రం వీళ్లందరీ కంటే భిన్నంగా ఉంది. అతడు పూర్తిగా తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తెలుగు మార్కెట్ తోనే ఇరుగు పొరుగునా మార్మోగాలని మహేష్ భావిస్తున్నారు. వసూళ్ల పరంగా మహష్ సినిమాలు వరుసగా 150 కోట్ల మార్క్ ని సునాయాసంగా దాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ పాన్ ఇండియా కేటగిరీపై అంతగా దృష్టి పెట్టడం లేదట. మరోవైపు మహేష్ తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ .. ఏఎంబీ మాల్స్ విస్తరణపైనా దృష్టి సారించి ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకెళుతున్నారు. వాణిజ్య ప్రకటనలతోనూ మహేష్ బిజీగా ఉన్నారు. రాజమౌళితో బహుశా మహేష్ పాన్ ఇండియా ప్రయాణం మొదలవుతుందని అభిమానులు ఇప్పటికి ఆశిస్తున్నారు. ఈ సినిమానే మహేష్ కి హిందీ డెబ్యూ అవుతుందా? అన్నది చూడాలి. అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. పాన్ ఇండియా వార్ లో ప్రభాస్-చరణ్-తారక్ - బన్ని తదితరులు దూసుకుపోతున్న సంగతి తెలిసినదే.