గౌతమి అలా అనేసింది ఏంటో!!

Update: 2017-08-26 07:38 GMT
నటనలో లోక నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బహుబాష నటుడు కమల్ తన వ్యక్తి గత జీవితంతో మాత్రం అనేక విమర్శలను ముఠా గట్టుకున్నాడు. రెండు సార్లు పెళ్లి చేసుకొని పెటాకులు చేసుకున్నాడు. అలాగే మరో హీరోయిన్ గౌతమి తో 14 ఏళ్ళు సహజీవనాన్ని కొనసాగించి ఆమెతో కూడా విభేదాలు వచ్చి విడిపోయాడు.

అయితే ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నారని ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. నెటిజన్స్ కూడా వారిద్దరిపై పలు విధాలుగా కామెంట్స్ చేశారు. దీంతో గౌతమికి కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే తన స్పందనను ఘాటుగా తెలియజేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గౌతమి ఈ విధంగా స్పందించింది.మూర్ఖులు చాలా మాట్లాడతారు .. అలాగే కుక్కలు కూడా చాలా మొరుగుతాయి అని చెబుతూ.. ఇలాంటి విషయాల గురించి కాకుండా ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి మాట్లాడమని తనదైన శైలిలో గౌతమి స్పందించింది. అలాగే తను మళ్ళీ కమల్ తో కలవలేనని కూడా వివరణ ఇచ్చింది.

మొత్తానికి ఒక ప్రక్కన చాలామంది పెళ్ళి చేసుకుని డైవర్స్ లు తీసుకుంటుంటే.. వీరు సహజీవినం ఉంటూ డైవర్స్ తీసుకున్నారు. కలిసున్నప్పుడు మనోల్ళ స్టేట్మెంట్లు ఇవ్వలేదు కాని.. విడిపోయాక మాత్రం విడిపోయాను అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అది సంగతి.
Tags:    

Similar News