నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లు కూడా వేగం పుంజుకున్నాయి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెంత తిరుపతిలో బాలయ్య మూవీ పాటల పండుగ జరగనుంది.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహణ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. శాతకర్ణి ఆడియో వేడుక నిర్వహించే ప్రాంతంలో ప్రత్యేక పూజలు జరిపి మరీ పనులు ప్రాంభించారు. ఈ నెల 26న ఈ పండుగ జరగనుండడం.. దీనికి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండడంతో.. భద్రతాపరంగా కూడా ఏర్పాట్లు గట్టిగానే జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కు రానుండడడంతో.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి.
తెలుగు ప్రాంతాన్ని వేదికగా చేసుకుని.. అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కథను.. అత్యంత ఆకర్షణీయంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించగా.. శాతకర్ణి పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకుల నుంచి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/