నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు షెడ్యూల్స్ లోను యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్.. ఈ సారి రాజదర్బార్ సీన్లను పిక్చరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో పాటు రాజమాత గౌతమిగా హేమా మాలిని.. రాణీ వశిష్టీ దేవిగా శ్రియ కూడా.. షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న షెడ్యూల్ కోసం.. అక్కడే ఓ పెద్ద దర్బార్ సెట్ ను కూడా నిర్మించగా.. ఇప్పుడు అదే సెట్ లో ఓ పాటను కూడా పిక్చరైజ్ చేయనున్నారట. సినిమాకి ఈ పాట చాలా కీలకంగా ఉంటుందని.. అందుకే కొంత ఎక్కువ టైమ్ కేటాయించారని తెలుస్తోంది. ఈ నెల 25 తో మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి కానుండగా.. ఆ తర్వాత హైద్రాబాద్ లో మిగిలిన భాగం షూట్ చేయనున్నారు.
గతంలోనే గౌతమిపుత్ర శాతకర్ణికి రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.. ఇప్పుడు జరుగుతున్న మూడో షెడ్యూల్ తో 80శాతం షూటింగ్ పూర్తయిపోతుందట. మిగిలిన భాగాన్ని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసేసి.. ఆ తర్వాత కంప్లీట్ గా గ్రాఫిక్ వర్క్ పైనే కాన్సంట్రేట్ చేస్తాడట దర్శకుడు. 2017 సంక్రాంతికి గౌతమిపుత్రుడు థియేటర్లలోకి వస్తాడని.. ముందే ఖాయం అయిపోయింది.