అప్పటి ప్రిన్స్ గుర్తుకొస్తున్నాడు

Update: 2018-05-10 04:40 GMT
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. హీరోగా కన్నా ముందు ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలే చేశాడు. వాటిలో సూపర్ హిట్లు బోలెడున్నాయి. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగానే డ్యాన్సులు.. ఫైట్లతో అదరగొట్టేశాడు. ఆ రోజుల్లోనే మహేష్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

చదువులు పూర్తి చేసి హీరోగా నటించడం మొదలు పెట్టాక తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ చిన్నప్పటి రోజులను అతడి ఫ్యాన్స్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దానికి కారణం... మహేష్ కొడుకు గౌతమ్. తాజాగా మహేష్ భార్య నమ్రత తండ్రీ కొడుకుల ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేష్ - గౌతమ్ లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలో గౌతమ్ ను కాస్త తదేకంగా చూసిన వారందరికీ కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ గుర్తుకు రాకుండా ఉండడు. దాదాపుగా అదే ఎత్తు.. అదే పోలికలు.. అదే తలకట్టు.. చిరునవ్వుతో చిన్నప్పటి ప్రిన్స్ ను మళ్లీ కళ్ల ముందు నిలిపాడు. కొడుకుతో మాట్లాడుతూ మహేష్ చాలా కూల్ లుక్ తో కనిపించాడు.

గౌతమ్ ఒడ్డూ పొడవు దాదాపుగా మహేష్ లా ఉండటం అభిమానులకు తెగ సంతోషం కలిగించింది. ఈ ఫొటోలో దాదాపుగా మహేష్ భుజాల అంత ఎత్తు ఉన్నచూసిన గౌతమ్ ను చూశాక బాగానే పొడుగయ్యాడనే మాట మనసులో మెదలక మానదు. తండ్రి పోలికలు కొడుకుకు రావడం సహజమే అయినా అచ్చు గుద్దినట్లు అలాగే ఉండటం మాత్రం ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తోంది.





Tags:    

Similar News