#2016: గీతా ఆర్ట్స్ పండగ చేస్కుంది

Update: 2016-12-31 15:30 GMT
2016 సంవత్సరం ముగిసిపోయింది. పెద్ద చిన్నా సినిమాల సంఖ్య బాగానే ఉన్నా.. ఈ ఏడాది సక్సెస్ రేషియో పర్లేదనే అనిపించింది. కానీ ఒకే ఒక్క నిర్మాణ సంస్థ మాత్రం అన్ని చిత్రాలతోనూ సక్సెస్ సాధించగలిగింది. అదే అల్లు అరవింద్ సారధ్యంలోని గీతా ఆర్ట్స్.

సమ్మర్ లో వచ్చిన అల్లు అర్జున్ మూవీ సరైనోడు.. గీతా ఆర్ట్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమా. అప్పటివరకూ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్.. మొత్తం మీద ఇండస్ట్రీ హిట్స్ జాబితాలో చేరిపోయి.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ గా నిలిచాడు సరైనోడు. ఆ తర్వాత అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో కూడా సక్సెస్ సాధించారు అల్లు అరవింద్. శిరీష్ కెరీర్ ని గాడిలో పెట్టడమే కాదు.. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ని ఫ్యామిలీస్ కి కలిగించగలిగారాయన. ఇద్దరు కొడుకులతో రెండు హిట్స్ సాధించిన అల్లు.. రామ్ చరణ్ ధృవతో కూడా హిట్ కొట్టేశారు.

ధృవను వేరే ప్రొడ్యూసర్ చేయాల్సి ఉన్నా.. ఆఖరి నిమిషంలో అల్లు అరవింద్ చేతికి పగ్గాలు వచ్చేశాయి. ఈయన హ్యాండ్ పడ్డాక బజ్ మారిపోయింది. డీమానిటైజేషన్ తర్వాత వచ్చిన సినిమాల్లో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ ఒకటిగా ధృవ నిలిచిందంటే.. ఈ మూవీ సక్సెస్ అర్ధమవుతుంది.

ఇక గీతాఆర్ట్స్2 అంటూ స్టార్ట్ చేసిన బ్యానర్ పై.. గతేడాది భలేభలే మగాడివోయ్ తీసి హిట్ కొట్టిన ఈయన.. అదే సినిమాను రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి ఈ ఏడాది కన్నడలో తీశారు. సుందరగణ రాజా అనే టైటిల్ పై రీమేక్ అయిన ఈ మూవీ.. శాండల్ వుడ్ లో సూపర్ గా వసూళ్లు సాధిస్తోంది. తాను తీసిన 4 సినిమాలను హిట్స్ గా మార్చి.. గీతా ఆర్ట్స్ పవర్ చూపించారు అల్లు వారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News