ఆయన లేకపోతే తను లేనంటున్న బొమ్మరిల్లు హాసిని!

Update: 2021-02-03 16:30 GMT
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలు ఆపేసిన హీరోయిన్ జెనీలియా. పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి అవుతుందట. తెలుగు ఇండస్ట్రీలో 'హహ్హ.. హాసిని' అంటే ఇప్పుడే కాదు ఎప్పటికి గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా మాత్రమే. తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళం మరాఠీ అంటూ ఇలా సుమారు ఎనిమిది బాషలలో నటించింది జెనీలియా.

 కానీ ఏ భాషలో ఎన్ని చేసినా స్టార్ హీరోయిన్ అనే హోదా సొంతం చేసుకుంది మాత్రం తెలుగులోనే అని చెప్పాలి. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది జెనీలియా. ముఖ్యంగా యువత జెనీలియా అంటే ఎక్కడలేని ప్రేమ కురిపిస్తారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు అంతలా దగ్గరైంది.

తన అమాయకమైన చూపులతో.. నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ హీరో రితేష్ దేష్‌ముఖ్‌తో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది జెనీలియా. కానీ కొంత కాలంగా మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ 'బాయ్స్' మూవీతో సినీఎంట్రీ ఇచ్చిన జెన్నీ.. తెలుగులో చాలానే చేసింది కానీ బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రతో జెన్నీ అందరి మనసులకు దగ్గరైంది. 2003లో 'తుఝే మేరీ కసం' అనే సినిమాతో జెనీలియా - రితేష్ దేశ్‌ముఖ్‌ ప్రేమలో పడ్డారు.

తర్వాత తొమ్మిదేళ్లకు 2012లో పెళ్లి చేసుకుని గృహిణిగా సెటిల్ అయింది. అయితే తాజాగా వారి పెళ్లి వార్షికోత్సవం సందర్బంగా ఓ పోస్ట్ పెట్టింది. 'నువ్వు లేకపోతే నేనులేను. నీ ప్రేమపిచ్చిలో ఉన్నా..' అని జెన్నీ పోస్ట్ చేయగా.. 'నేను కోరుకునే ప్లేస్ ఇదే' అంటూ జెన్నీ భుజంపై తలవాల్చిన ఫోటో పోస్ట్ చేసాడు రితేష్. ఈ విధంగా ఒకరిపై ఒకరు తమ బయట పెట్టారు స్టార్ కపుల్.
Tags:    

Similar News