ఆల్రెడీ బాలయ్య ఫుల్లుగా వాడేశాడు నేచురల్ స్టార్ నాని. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో బాలయ్య అభిమానిగా కనిపిస్తూ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో బాలయ్య టాప్ లెవెల్లో చూపించి ఆయన అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఐతే నాని కొత్త సినిమా ‘జెంటిల్ మన్’ను కూడా బాలయ్య పుట్టిన రోజైన జూన్ 10న విడుదల చేస్తున్నారని.. నాని మరోసారి బాలయ్యను వాడేస్తున్నారని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘జెంటిల్ మన్’ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కు బాలయ్యతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇది వాస్తవమే అనుకున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ‘జెంటిల్ మన్’ జూన్ 10న కాకుండా వారం లేటుగా 17న విడుదల కాబోతోంది.
నిన్న ఆడియో వేడుకలో ‘జెంటిల్ మన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంతకుముందు బాలయ్యతో ఆదిత్య 369.. వంశానికొక్కడు.. మిత్రుడు లాంటి సినిమాలు తీసిన సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. నిన్న రిలీజైన ‘జెంటిల్ మన్’ టీజర్ సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది.
ఇప్పటిదాకా సాఫ్ట్ క్యారెక్టర్లే చేసిన నాని.. ఈసారి వయొలెంట్ క్యారెక్టర్ చేశాడిందులో. అతడి పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. ‘హీరోనా.. విలనా’ అంటూ మొదట్నుంచి ఈ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఇంద్రగంటి.. ట్రైలర్లో మరిన్ని సందేహాలు రేకెత్తించాడు. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవాలి.. నమ్మించి చంపేయాలి’’ అన్న నాని డైలాగ్ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి నాని-ఇంద్రగంటి చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.