చాలా కామెడీగా 'యు' సర్టిఫికేట్ రావడం.. ఆ సినిమాలో లిప్ కిస్సులో లేకపోతే హీరోయిన్ మసాలా ఎక్సపోజింగులో ఉండటం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. రెండు పెదల ముద్దులున్న బ్రహ్మోత్సవం.. ఏకంగా పెళ్లిచూపుల్లో హీరోయిన్ అందాలు ఆరబోయించిన అ..ఆ.. అలా 'యు' తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పుడు హీరో నాని వంతొచ్చింది.
ఈ నెల 17న విడుదలవుతున్న జెంటిల్ మన్ సినిమాకు ఈరోజే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లవ్ స్టోరీ ఏదైనా కూడా వయలెన్స్ లేకపోతే నచ్చదే అంటూ ట్రైలర్ లోనే ఫైట్లు చూపించినా కూడా.. ఈ సినిమాకు 'యు' సర్టిఫికేట్ రావడం కాస్త ఆశ్చర్యకరమే. పైగా హీరోయిన్ సురభి మరియు నివేద థామస్ కూడా అందాల మోత బాగానే మొయించినట్లున్నారు. అయినాసరే సినిమాను అందరూ కలసి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అని బోర్డువారు తీర్పునిచ్చారు. కాబట్టి.. ఈ సినిమాలో కూడా ముద్దూ ముచ్చట్లన్నీ ఉన్నాయో.. లేకపోతే మాంచి మసాలా ఉందో అప్పుడే చెప్పలేం.
తొలిసారిగా తన కెరియర్ లో కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను చేస్తున్నాడు హీరో నాని. ఎందుకు నెగెటివ్ ఎందుకు పాజిటివ్ అనేది మనం సినిమా చూస్తూనే తెలుస్తుందని ఆల్రెడీ చెబుతున్నారు. 'అష్టాచమ్మా' సినిమాతో నాని ను హీరోగా పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను రూపొందించాడు.