మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేష్ - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - ఫస్ట్ సింగిల్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న 'గని' చిత్రాన్ని.. చివరకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజున నాని 'శ్యామ్ సింగరాయ్'.. అక్కినేని నాగార్జున సమర్పిస్తున్న '83' సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలానే ఒక వారం ముందు అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' విడుదల అవుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల మధ్య క్లాష్ ఇండస్ట్రీకి మంచిది కాదని భావించి 'గని' సినిమాని రేసులో నుంచి తప్పిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వరుణ్ తేజ్ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందని.. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ని వదిలారు.
''గని అనేది మా హృదయాలకు బాగా దగ్గరైన సినిమా. ఈ చిత్రాన్ని రూపొందించడానికి మేము చాలా కష్టపడ్డాం. దేనికి రాజీ పడకుండా అరుదైన ప్రదేశాలలో భారీ సెట్స్ లో చిత్రీకరించాం. ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించాము. పాండమిక్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి''
''క్లాష్ ని నివారించడానికి.. బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరి పై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని మా చిత్రాన్ని వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము. 'గని' ఖచ్చితంగా థియేటర్లోనే విడుదల అవుతుంది. ఈ సినిమా అందరికీ చిరస్మరణీయమైన అనుభవం అవుతుందని మేము నమ్ముతున్నాం. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాం'' అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, 'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.