మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద నిర్మించిన ఈ సినిమా లో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ లో వస్తుందని బలంగా చెప్పుకొచ్చారు. కాని డిసెంబర్ లో వరుసగా సినిమాలు ఉండటంతో పాటు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలనే ఉద్దేశ్యంతో గని సినిమా విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన గని సినిమా విడుదల విషయంలో మళ్లీ కొత్త చర్చ మొదలు అయ్యింది. డిసెంబర్ బరి నుండి తప్పుకున్న గని సినిమాను జనవరి లో ఉన్న పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేయాలని భావించడం లేదు. కాని ఫిబ్రవరిలో సినిమా ను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
గని టీజర్ వచ్చినప్పటి నుండి సినిమాపై అంచనాలు ఆసక్తి పెరిగాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం ప్రేక్షకులకు కాస్త అసహనం కలిగిస్తుంది. ఈ సినిమా విడుదల కోసం ఫిబ్రవరిని పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరిలో చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆచార్య నుండి మొదలుకుని మేజర్.. ఖిలాడి.. ఎఫ్ 3 ఇంకా చాలా సినిమాలు కూడా ఫిబ్రవరిలో విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరిలోని అన్ని వర్గాల్లో కూడా సినిమాలు పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నాయి. కనుక ఫిబ్రవరిలో అయినా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సిద్దమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో సినిమా ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గని సినిమా విడుదల విషయంలో ఒకటి రెండు వారాల్లో కీలకమైన ప్రకటన వస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతున్న ఈ సమయంలో గని సినిమా విడుదల గురించిన చర్చ ప్రథానంగా సాగుతోంది. ఓటీటీ లో సినిమాను విడుదల చేసేందుకు గని మేకర్స్ ఇంట్రెస్ట్ గా ఉన్నారా అనే విషయమై కూడా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్న సమయంలో ఓటీటీ రిలీజ్ కు వెళ్తే వచ్చే స్పందన ఏంటీ అనేది కూడా చూడాలి.