ఫస్ట్ లుక్: అండర్ వాటర్ అలజడే..

Update: 2016-12-05 04:52 GMT
మొన్నటివరకు హీరో రానా దగ్గుబాటి 'ఘాజి' అంటూ ఒక సినిమా చేస్తున్నాడంటే మాత్రం.. అందరూ ఏదో లైట్ తీసుకున్నారు. కాని అలా లైట్ తీసుకున్న వారంత ఇప్పుడు ఒక స్ర్టాంగ్ కాఫీ తాగి మరీ మైండ్ బ్లోయింగ్ గా మైండ్ బ్లో అయిపోయింది అంటున్నారు. ఎందుకో తెలుసా?

''ఘాజి'' సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను గత సాయంత్రం విడుదల చేశాడు హీరో రానా. ఈ సినిమాను నూతన దర్శకుడు సంకల్ప్ ఎంతో ఛాలెంజింగ్ గా తీస్తున్నాడని పోస్టర్ చూస్తేనే అర్దమవుతుంది. 1971లో పాకిస్తాన్ తో యుద్దం జరుగుతున్న సమయంలో.. పాక్ సబ్ మెరైన్ అయిన ఘాజీ.. దాదాపు విశాఖపట్నం తీరం వరకు వచ్చేసింది. అక్కడే ఉన్న మన దేశపు కీలకమైన వార్ షిప్పుల మీద ఎటాక్ చేసినా.. లేదా విశాఖ పోర్టుపై ఎటాక్ చేసినా కూడా.. దారుణం జరిగుండేది. కాని ఉన్నట్లుండి ఆ ఘాజీ పేల్చబడింది. మేం పేల్చేశాం అని భారతీయ నావికాదళాలు చెబుతుంటే.. కాదు పొరపాటున మా వెసల్ పేలిపోయింది అని ఇప్పటికీ పాకిస్తాన్ చెబుతుంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేదే ఇప్పుడు సినిమా రూపంలో చూపిస్తున్నారు.

ఇప్పుడు రానా సినిమా ''ఘాజీ'' పోస్టర్ చూస్తుంటే.. అండర్ వాటర్ లో జరిగిన అలజడి అంతా చాలా అద్భుతంగా చూపిస్తారనే అనిపిస్తోంది. పైగా హిందీలో కరణ్‌ జోహార్ ప్రెజెంట్ చేయడం.. తెలుగులో పివిపి రిలీజ్ చేస్తుండటంతో.. ఇంకా అంచనాలు పెరిగిపోయాయ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News