కొత్త స్టయిల్లో ఘాజీ ప్రమోషన్స్!!

Update: 2017-02-05 10:50 GMT

ఇండియాలో మొదటి సబ్మెరైన్ థీమ్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ ఘాజీ. తెలుగు.. తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. బాలీవుడ్ వెర్షన్ కు ది ఘాజీ అటాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి చేస్తున్న డిఫరెంట్ ప్రమోషన్స్ చూస్తుంటే.. కొత్తగా చేస్తున్న ప్రయత్నాలు భలే ఆకట్టుకుంటున్నాయని అనిపిస్తుంది.

సముద్రంలో నుంచి మెసేజెస్ ను ను కోడ్ లాంగ్వేజ్ లో పంపడం.. వీటిని ల్యాండ్ పై ఉన్న టీం డీకోడ్ చేయడం లాంటివి టైటానిక్ వంటి కొన్ని సినిమాల్లో చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి ఒక కోడ్ లాంగ్వేజ్ సంభాషణనే.. పోస్టర్ గా వేసి మరీ ఆకర్షిస్తోంది ఘాజీ టీం. 'ఓవర్' అనే హెడింగ్ తో 'ఈ సందేశానికి ఇదే ఆఖరు. రెస్పాన్స్ తప్పనిసరి.. ఆల్ఫా.. మీ అంచనా వేస్తున్న సమయం(ఈటీఏ-ఎస్టిమేటెడ్ టైం ఆఫ్ అరైవల్) ఏంటి.. ఓవర్' అని ప్రశ్నను వేశారు.

అలాగే 'ఔట్' అంటూ ఇచ్చిన సమాధానం కూడా ఈ పోస్టర్లో కనిపిస్తుంది. 'మీకు ఇదే  మా ఆఖరి సందేశం. ప్రతిస్పందన అవసరం లేదు.. ఆల్ఫా.. ఈటీఏ  ఐదు నిమిషాలు.. ఓవర్' అంటూనే.. ఓవర్-ఔట్ పదాలను ఒకేసారి ఉపయోగించకూడదు అని చెప్పారు. ఈ మెసేజ్ ల ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావాలంటే మాత్రం.. కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ప్రమోషన్స్ విషయంలో ఘాజీ యూనిట్ ప్రయత్నాలు విభిన్నంగానే కాదు.. కొత్తటైపులో కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News