మ‌హేష్ కి జ‌న‌సేనాని కానుక‌లు దేనికి సంకేతం?

Update: 2021-11-05 05:44 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ఇండ‌స్ట్రీ స్నేహితులు చాలా త‌క్కువ‌. ఆయ‌నతో అత్యంత చ‌నువుగా ఉండే స్నేహితులు చెన్నైలోనే ఉన్నారు. హైద‌రాబాద్ లో అంత క్లోజ్ ప్రెండ్స్ ఎవ‌రూ లేర‌ని ఆయ‌నే చాలాసార్లు చెప్పారు. అప్పుడ‌ప్పుడు చ‌ర‌ణ్..బ‌న్ని..తార‌క్ ఫ్యామిలీస్ తో గెట్ టుగెద‌ర్ పార్టీలు త‌ప్ప‌! ఇత‌రుల‌తో మ‌హేష్ అంత చ‌నువుగా క‌నిపించింది లేదు. ఇక త‌న ద‌ర్శ‌కుల‌తోనే ఆయ‌న స్నేహం చేయ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ స్నేహం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. ఇక సినిమాలు చేసుకోవ‌డం త‌ప్ప ఇంకే విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హేష్‌ చెబుతూనే ఉంటారు. అలాంటి మ‌హేష్ ఇంటికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి బ‌హుమ‌తులు వెళ్లాయి.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ బ‌హుమ‌తుల్ని ప‌వ‌న్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా పంపించారు. అలాగే మ‌హేష్ - నమ్ర‌త దంప‌తులు వారి కుటుంబానికి ప‌వ‌న్ దంప‌తులు ప్ర‌త్యేకంగా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తిగా మ‌హేష్ కూడా విషెస్ తెలియ‌జేసారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్నారు. ఇక ఇదే వేదిక‌గా మ‌హేష్ చాలా మందికి విషెస్ తెలిపారు. మ‌హేష్ - ప‌వ‌న్ మ‌ధ్య గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఆప్యాయ‌త‌ల గురించి తెలిసిన‌దే అయినా ప‌వ‌న్ ఎప్పుడూ ఇలా మ‌హేష్ కి పండ‌గ‌ల సంద‌ర్భంగా ప్రత్యేకంగా బ‌హుమ‌తులు పంపి మ‌రీ విషెస్ చెప్పింది లేదు. అలాంటి స‌న్నివేశం చోటు చేసుకోవ‌డం ఇదే తొలిసారి. సాధార‌ణంగానే ప‌వ‌న్ ఫ్యామిలీ ఇలాంటి విష‌యాల‌కు చాలా దూరంగా ఉంటుంది. కానీ ఎందుక‌నో ఈసారి దీపావ‌ళికి మ‌హేష్ కి స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా బ‌హుమ‌తులు పంపించారు.

ఇత‌ర‌ స్టార్ హీరోలంద‌ర్నీ వ‌దిలేసి మ‌హ‌ష్ మాత్రమే అంత స్పెష‌ల్ దేనికి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. స‌హ‌జంగానే ఆ స‌న్నివేశం చోటు చేసుకుందా? అన్న‌ది క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏదేమైనా ఎపీలో రాజ‌కీయం వేడెక్కుతున్న క్ర‌మంలో వ‌వ‌న్ పొలిటిక‌ల్ గేమ్ పై ఆస‌క్తి పెరుగుతోంది. ఈ స‌న్నివేశంలోనే మ‌హేష్ ఇంట బ‌హుమ‌తులు అభిమానుల్లో సందేహాల‌కు కార‌ణ‌మైంది. సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ తొలి నుంచి వైకాపాకి మ‌ద్ద‌తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాం నుంచి సీనియ‌ర్ హీరో కృష్ణ ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆ కుటుంబం మ‌ద్ద‌తిస్తున్న వైనం తెలిసిందే. మ‌హేష్ బాబు బావ గారు గ‌ల్లా జ‌య‌దేవ్ మాత్రం తేదేపాలో కొన‌సాగుతున్నారు.
Tags:    

Similar News