ఫిట్‌ నెస్‌ చూపించినందుకు నటుడిపై కేసు బుక్‌

Update: 2020-11-07 13:30 GMT
బాలీవుడ్‌ విలక్షణ నటుడు మిలింద్‌ సోమన్‌ ఇటీవల తన 55వ పుట్టిన రోజు సందర్బంగా తన ఫిట్‌ నెస్‌ ను చూపించేందుకు గాను గోవా బీచ్‌ లో న్యూడ్‌ గా రన్నింగ్‌ చేశాడు. రెండు రోజుల పాటు మిలింద్‌ సోమన్‌ ఫిట్‌ నెస్‌ విషయం ఆయన న్యూడ్‌ రన్నింగ్‌ విషయం జాతీయ మీడియా నుండి గల్లీ మీడియా వరకు అన్ని చోట్ల కూడా తెగ ప్రచారం జరిగింది. ఈ వయసులో మిలింద్‌ ఫిట్‌ నెస్‌ సూపర్‌ అంటూ కొందరు ఇదేం పని అంటూ మరి కొందరు ఆయన్ను విమర్శించారు. తాజాగా ఆయనపై గోవా పోలీసులు కేసు నమోదు చేసి షాక్‌ ఇచ్చారు.

ఇండియన్‌ చట్టం ప్రకారం రోడ్లపై ఇలా న్యూడ్‌ గా పరుగులు తీయడం.. న్యూడ్‌ గా ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నేరం. అందుకే మిలింద్‌ సోమన్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే అరెస్ట్‌ చేస్తామంటూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మిలింద్‌ చేసిన పని నేరం కాదంటూ నెటిజన్స్‌ కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే కొందరు మాత్రం చట్టం ముందు అందరు సమానులే. కనుక ఆయన న్యూడ్‌ గా చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే. లేదంటే ముందు ముందు మరిన్ని ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు చూడలేక జనాలు తలలు దించుకోవాల్సి వస్తుంది అంటూ కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మిలింద్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News