మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాంబోతుంది. దీంతో ఆక్షణాల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తెనున్నారు. ఇందులో చిరంజీవికి బాడీ గార్డ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.
ఆ రకంగా గాడ్ ఫాదర్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సల్మాన్ ఎంట్రీతో హిందీలోనూ గాడ్ పాదర్ దుమ్ముదులిపేస్తుందంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్షణాన అభిమానులకు ఓ డౌట్ కొడుతుంది. సల్మాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే ఇంకా బాగుండేది కదా? అన్నదమ్ములిద్దరు కలిసి సునాయాసంగా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగించేవారు కదా? మరి మోహన్ రాజా అలా ఎందుకు ప్లాన్ చేయలేదు.
అతను కాకపోతే ఇంకా మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలున్నారు కదా? వాళ్లనెందుకు తీసుకోలేదు. పనిగట్టుకుని సల్మాన్ నే ఎందుకు తీసుకొచ్చినట్లు? అంటే మోహన్ రాజా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పే ఓ స్టార్ కావాలి. ఇంట్లో హీరోలు చిరంజీవి గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడినా అది కిక్ రాదు.
అదే బయట స్టార్ మాట్లాడితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. అసలు బ్రహ్మ ఎలాంటి వాడో తెలుసా? అని బిల్డప్ ఇచ్చే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ లో బ్రహ్మ ఎలాంటి వాడో విజువల్ గా చూపించలేం. కేవలం మాటే ప్రేక్షకులకు చేరాలి. అలా చేరాలంటే స్టార్ కావాలి. అతను సల్మాన్ అయితే బాగుంటుందని భావించి అతన్ని దించాం.
మెగా ఫ్యామిలీతో..అందులోనూ చిరంజీవితో ప్రత్యేకమైన అనుబంధం సల్మాన్ సొంతం. చిరుకి బాగా దగ్గరైన పెద్ద స్టార్ ఎవరంటే? సల్మాన్ గుర్తొచ్చారు. ఆయ నెప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరంజీవి ఇంట్ లో బస చేస్తారు. చరణ్ తో ఎంతో క్లోజ్ గా ఉంటారు. నా ఆలోచనని చిరు...చరణ్ లకు చెప్పడం..సల్మాన్ ఒప్పుకోవడం అన్ని 20 నిమిషాల్లో జరిగిపోయాయి.
చిరంజీవి మళ్లీ సల్మాన్ కి ఫోన్ చేసి నువ్వు నిజంగా చేస్తున్నావా? అని సల్మాన్ ని అడిగితే ఆయనకు డౌట్ కొట్టింది. అప్పుడాయన నెగిటివ్ రోల్ అని అడిగారు. దానికి కాదు పాజిటివ్ అని చిరు చెప్పగానే ఇంకెందుకు ఆలస్యం దూకేద్దాం అని ప్రామిస్ చేసారు. ఇచ్చిన మాట ప్రకారం సల్మాన్ షూట్ లో జాయ అయిన తన పార్ట్ పూర్తిచేసి వెళ్లిపోయారని మోహన్ రాజా తెలిపారు. అదీ సల్మాన్ లెక్క.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.