నచ్చిన స్టార్ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ వస్తోందంటే సోషల్ మీడియాలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో నెట్టింట మోత మోగించేస్తారు.. రోజంతా అదే ట్రెండ్ లో వుండేలా వరుస ట్వీట్ లు, రీట్వీట్ లు చేస్తూ మరింత వైరల్ చేస్తుంటారు. మరి అదే అభిమానులకు చిర్రెత్తుకొస్తే..అభిమానం దేవుడెరుగు టీమ్ కు అవమానం ఎదురవుతుంటుంది. నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు. మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' ముందు వరుసలో నిలుస్తోంది. మోహన్ రాజా డైరెక్షన్ లో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ వీ ప్రసాద్ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ప్రతీదీ ఇప్పడు మెగా ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తోంది. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తరువాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటారని ఫ్యాన్స్ భావించారు కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో తమన్ అందించిన నేపథ్య సంగీతం 'గని' మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ ని పోలి వుండటంతో ఒక్కసారి గా తమన్ పై విరుచుకుపడ్డారు.
ఇక సినిమాలో మెగాస్టార్ కు హీరోయిన్ లేకపోవడంతో సల్మాన్ ఖాన్ తో కలిసి చిరుపై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. ముంబైలోని ఎన్టీ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవిపై ఈ పాటని చిత్రీకరించారు. ఈ ప్రత్యేక డ్యాన్స్ నంబర్ కు ఇండియన్ మైఖేల్ జాక్సన్, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ ని మంగళవారం విడుదల చేస్తూ ఫుల్ సాంగ్ ని సాయంత్రం 5:05 నిమిషాలకు రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు.
అయితే అది రిలీజ్ కాలేదు. ఫైనల్ గా బుధవారం రాత్రి 7:02 నిమిషాలకు రిలీజ్ చేశారు. కానీ అది లిరికల్ వీడియో కాదు.. ఆడియో. 'తార్ మార్ తక్కర్ మార్...' అంటూ సాగే ఈ ఆడియో సాంగ్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ పాట యూట్యూబ్ లో చూడాలని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చేసింది. టీమ్ ఊరించి ఉడికించి చివరి క్షణంలో ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ చిత్ర బృందంపై మండిపడుతూ నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 5న దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.