ప్రస్తుత రోజుల్లో సినిమాలకి సీక్వెల్స్ బాగానే వస్తున్నాయి. ఒక్క సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే దర్శకులు ఆ కథని ఇంకా పోడిగించి తెరకెక్కిస్తున్నారు. తారగణాన్ని చేంజ్ చేసినా కంటెంట్ లో మాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ తరహాలో చాలా చిత్రాలే వచ్చాయి. ముఖ్యంగా గోల్ మాల్ వెర్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే గోల్ మాల్ పేరుతో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో మరో గోల్ మాల్ చిత్రం రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా దీపావళికి రాబోతోంది. అజయ్ దేవగన్ - పరిణితి చోప్రా ఆ సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే డబ్బింగ్ పనులను పూర్తి చేసి దీపావళికి హిందీ - తెలుగులో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. థమన్ కి బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలు తెలుగులో అంతగా ఆడవు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.