ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌!

Update: 2022-08-10 10:30 GMT
స్టార్ హీరోల బ‌ర్త్ డేల‌కు వారు న‌టించిన మెమ‌ర‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ల‌ని రీ రిలీజ్ చేయాల‌ని, 4కెలో కి క‌న్వ‌ర్ట్ చేయాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ డిమాండ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `పోకిరి`తో మ‌రింత పెరిగింది.

మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్బంగా 2006లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన `పోకిరి`ని 4కెలోని క‌న్వ‌ర్ట్ చేసి ఆగ‌స్టు 9న రీ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని మొత‌తం 360 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.

విడుద‌లైన ప్ర‌తీ థియేట‌ర్ లోనూ `పోకిరి` ప్ర‌తీ షో హౌస్ ఫుల్స్ తో ర‌న్న‌వుతోంది. అంతే కాకుండా ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ తో హోరేత్తిపోతున్నాయి. ఈ హంగామా చూసిన మిగ‌తా హీరోల ఫ్యాన్స్ కూడా మేక‌ర్స్ పై ఒత్తిడి చేస్తున్నారు. త‌మ అభిమాన హీరో ఫేవ‌రేట్ మూవీని కూడా బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌మ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవ‌ల మ‌హేష్ `పోకిరి` 4కె ప్రింట్ రిలీజ్ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు `జ‌ల్సా` మూవీని ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని గీతా ఆర్ట్స్ వ‌ర్గాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ముందు మాస్ట‌ర్ ప్రింట్ మిస్సింగ్ అంటూ చెప్పుకొచ్చిన గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు తాజాగా అభిమానులు గుడ్ న్యూస్ చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రింట్ ల‌భించింద‌ని, దాన్ని 4కెలోకి మ‌రుస్తున్నామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించిన‌ట్టుగా తెలిసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌లు సెప్టెంబ‌ర్ 2న ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అదే రోజు `పోకిరి` త‌ర‌హాలో `జ‌ల్సా` 4కె ప్రింట్ ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ చేయాల‌ని గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే 4కె ప‌నులు ప్రారంభించార‌ట‌. ప్ర‌త్యేక షోల‌కు సంబంధించిన స‌మాచారాన్ని త్వ‌ర‌లోనే గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు మొద‌లు పెట్టేశార‌ట‌. ఇక థియేట‌ర్ల‌లో `జ‌ల్సా`ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారో.. సెల‌బ్రేష‌న్స్ తో ఏ స్థాయిలో హోరెత్తిస్తారో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News