బ్రూస్ లీ.. అది శుద్ధ అబద్ధమట

Update: 2015-09-09 11:05 GMT
 ఇప్పటికే మెగా అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోయేంంత స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి ‘బ్రూస్ లీ’లో. ట్రైలర్ లోనే పిచ్చెక్కించేశాడు రామ్ చరణ్. అతడి సందడి చాలదన్నట్లు మెగాస్టార్ చిరంజీవి చాలా విరామం తర్వాత ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చరణ్, చిరులను కలిసి తెరమీద చూడటం మెగా అభిమానులకు ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. ఇంతలోనే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడంటూ ఒక సెన్సేషనల్ న్యూస్ రెండు మూడు రోజుల నుంచి మెగా అభిమానుల్ని షేక్ చేసేస్తోంది. నిజమేనా.. పవన్ ఒప్పుకున్నాడా.. అని ముందు సందేహించినా.. ఈ మధ్య చిరు కుటుంబంతో పవన్ కొంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఇది రూమర్ అని కొట్టి పారేయలేకపోయారు మెగా అభిమానులు.

చరణ్ సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ గాల్లో తేలిపోయారు. ఐతే వారి ఆశలపై నీళ్లు చల్లేశాడు రైటర్ గోపీ మోహన్. పవన్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదని.. అభిమానులు ఈ వార్తను నమ్మవద్దని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీంతో మెగా అభిమానులు డిజప్పాయింట్ అయిపోయారు. ఐతే గోపీ మాటల్ని అందరూ ఏమీ నమ్మేయట్లేదు. ఇంతకుముందు ఈ సినిమాలో చిరు నటించడం గురించి ముందు ఊహాగానాలు వినిపించినపుడు కోన వెంకట్ ఖండన ఇచ్చాడు. ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ విషయంలోనూ లేదు లేదు అనే అన్నారు. కానీ చివరికి చిరు ఇందులో నటిస్తున్నాడు, బ్రూస్ లీ అనే టైటిలే ఖాయమైంది. ఈ నేపథ్యంలో పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సినిమాలో నేరుగా సర్ ప్రైజ్ ఇవ్వాలని కూడా భావిస్తుండొచ్చేమో.
Tags:    

Similar News