గోపీచంద్ కు మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం మాస్ కంటెంట్ తోనే సినిమాలను తీయడం.. వాటిని సక్సెస్ తీరాలకు చేర్చగలగడం ఈ హీరో స్పెషాలిటీ. అయితే.. గత ఐదేళ్లలో లౌక్యం మినహాయిస్తే మరో సినిమా ఏదీ విజయం సాధించకపోవడంతో.. గోపీచంద్ పై ఒత్తిడి ఎక్కువగానే ఉంది.
ఈ శుక్రవారం నాడు ఆరడుగుల బుల్లెట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు గోపీచంద్. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం.. సౌత్ టాప్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటించడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రిలీజ్ ఆలస్యమయినా.. మొత్తానికి మూవీని థియేటర్లలోకి తెస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సక్సెస్ సాధించడం.. గోపీచంద్ కు చాలా ముఖ్యం. గౌతమ్ నందా.. ఆక్సిజన్ వంటి చిత్రాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న టైంలో ఆరడుగుల బుల్లెట్ థియేటర్లలోకి వస్తుండడంతో.. దీని రిజల్ట్ ఆ సినిమాల మార్కెటింగ్ పై కూడా ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం నాని..శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోలు బాగానే సత్తా చాటుతున్నారు. కానీ వారి జోనర్ వేరు. బడ్జెట్ పరంగా ఇదే సెగ్మెంట్ లో ఉన్నా.. మాస్ ఆడియన్స్ మెప్పుతోనే సక్సెస్ తీరాలకు చేరాల్సిన అవసరం గోపీచంద్ కు ఉంటుంది. మరి ఆరడుగుల బుల్లెట్ తో గోపీచంద్ ఎలాంటి రిజల్ట్ ఎదుర్కోనున్నాడో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/