`ఏక్ మినీ కథ` చిత్రంతో హిట్టు కొట్టాడు సంతోష్ శోభన్. అతడు నటించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. మెహ్రీన్ ఇందులో కథానాయిక. మారుతి దర్శకత్వంలో యువీ కాన్సెప్ట్స్- మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గీతం వైరల్ గా దూసుకెళ్లింది. టీజర్ లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి యుఏ సర్టిఫికెట్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలోకి వస్తోంది. 29 అక్టోబర్ సాయంత్రం 6 గం.ల నుంచి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ -హైదరాబాద్ వేదికగ ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మ్యాకో స్టార్ గోపిచంద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
నిజానికి ఈ ఈవెంట్ కి ప్రభాస్ రావాల్సి ఉన్నా అతడికి వీలు పడలేదని సమాచారం. డార్లింగ్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో ఈ వేదికను ఫుల్ ఫిల్ చేస్తున్నారన్నమాట. వర్షం డైరెక్టర్ శోభన్ వారసుడు సంతోష్ కి నిజానికి ప్రభాస్ తొలి నుంచి కెరీర్ పరంగా వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. అతడిని హీరోగా నిలబెట్టేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారు. యువి క్రియేషన్స్ అండదండలు అతడికి పుష్కలంగా ఉన్నాయి. ప్రతిభావంతుడైన సంతోష్ వరుసగా యువి సంస్థలో సినిమాలు చేస్తూ కెరీర్ ని మలుచుకుంటున్న సంగతి తెలిసిందే.