మెగాస్టార్ అనే మహా వృక్షమే అందరికీ స్ఫూర్తి: గోపీచంద్

Update: 2022-06-27 03:59 GMT
యాక్షన్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను గోపీచంద్ కి మంచి పేరు ఉంది. అయితే కొంతకాలంగా ఆయనకి సక్సెస్ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా చేశారు. మారుతి దర్శకత్వంలో ఆయన  చేయడం ఇదే మొదటిసారి. కథాకథనాల విషయంలో గీతా ఆర్ట్స్ వారు ఎంత కసరత్తు చేస్తారనేది గోపీచంద్ కి తెలుసు. అందువలన ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ .. " ముందుగా చిరంజీవి గారికి థ్యాంక్స్  చెప్పాలనుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలమైనా ఎప్పుడూ చిరంజీవి గారు నా ఫంక్షన్ కి రాలేదు. ఈ ఫంక్షన్ కి అడగ్గానే వచ్చినందుకు .. ఈ ఈవెంట్ కి ఇంతటి గ్రేస్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ రోజున మేము  యాక్షన్ సినిమాలు చేస్తుండొచ్చు  .. అందుకు రోప్స్ లాంటివి ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఆయన ఎంతో రిస్క్ చేశారు. 'గూండా'లో ట్రైన్ షాట్ ను ఇప్పుడు మేము కూడా చేయలేము.

ఒక మనిషి ఏదైనా సాధించాలనుకుంటే ఎంతలా కష్టపడాలనే దానికి చిరంజీవిగారే ఉదాహరణ. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కసితో .. పట్టుదలతో ఈ రోజున ఒక మహా వృక్షంలా ఇండస్ట్రీకి నిలబడ్డారు. ఇండస్ట్రీకి వస్తున్న చాలామందికి చిరంజీవిగారే స్ఫూర్తి.

ఇక ఈ సినిమా నేను చేయడానికి కారణం యూవీ వంశీ .. తను లేకపోతే నేను ఇంత మంచి కథను మిస్సయ్యేవాడిని. ఈ సినిమాతో నాకు మారుతి మంచి స్నేహితుడు అయ్యాడు. ఈ సినిమా తరువాత తాను మరింత  పెద్ద డైరెక్టర్ అవుతాడు.

 రాశి ఖన్నా తో కలిసి ఇంతకుముందు నేను వర్క్ చేశాను. ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో తనకి కరెక్ట్ రోల్ పడిందని అనుకుంటున్నాను. ఇక బన్నీ వాసు ఒక కథపై చేసే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఒక కథకి నన్ను హీరోగా పెట్టుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ టీమ్ చేతిలో పడిన ఏ సినిమా అయినా ఆల్రెడీ 50 శాతం హిట్ అనే చెప్పాలి. ఈ సినిమాకి కెమెరా వర్క్ .. సంగీతం హైలైట్ గా నిలుస్తాయి" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News