టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ నేడు 'పక్కా కమర్షియల్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లపై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ నేడు వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రంతో గోపీచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కేలానే కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. గోపీచంద్ ఓ బిగ్ ఫ్లాప్ మూవీ నుండి తెలివిగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ చిత్రం మరెదో కాదు 'విరాట పర్వం'. విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు.
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో విప్లవాత్మక ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ బాగున్నా.. కమర్షియల్ గా ఈ మూవీ ఫ్లాప్ అయింది. రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
ఈ నేపథ్యంలోనే ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి దింపేశారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. డైరెక్టర్ వేణు ఊడుగుల 'విరాట పర్వం'ను మొదట గోపీచంద్ తో చేయాలని భావించారట.
ఇందులో భాగంగానే ఆయన్ను కలిసి కథ కూడా చెప్పారట. అయితే గోపీచంద్.. ఈ కథలో ఎక్కువగా హీరోయిన్ కే ప్రాధాన్యత ఉందని, యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న తనకు ఇటువంటి చిత్రం సెట్ కాదని సున్నితంగా రిజెక్ట్ చేశారట.
దాంతో వేణు ఊడుగుల రానా వైపు మొగ్గు చూపగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కట్ చేస్తే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విరాట పర్వం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దీంతో బిగ్ ఫ్లాప్ నుండి గోపీచంద్ భలే తప్పించుకున్నాడంటూ అభిమానులు సంతోష పడుతున్నారు.