'క్రాక్' మూవీతో ట్రాక్ లోకి వచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని అదే ఊపుతో తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'వీర సింహారెడ్డి'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించగా, తనకు జోడీగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ తో పాటు మలయాళ హీరోయిన్ హనీరోజ్ నటించింది. బాలకృష్ణ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ పవర్ ఫుల్ క్యారెక్టర్లలో నటించారు.
భారీ అంచనాల మధ్య ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తూ వరల్డ్ వైడ్ గా సత్తా చాటుకుంటోంది. సంక్రాంతి సినిమాల్లో ప్రధమ స్థానాన్ని దక్కించుకోలేకపోయినా యావరేజ్ టాక్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మొదటి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది.
ఇదిలా వుంటే 'వీర సింహారెడ్డి' ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందు బాలకృష్ణ తో సినిమా అనుకున్నప్పుడు రేసీగా వన్ డేలో సాగే స్టోరీని వినిపించాడట. అయితే స్టోరీ మొత్తం విన్నాక బాలకృష్ణ ఇది సరిపోదు 'అఖండ' తరువాత ఫ్యాన్స్ నా నుంచి భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పారట.
అంతే కాకుండా నువ్వు చెప్పిన స్టోరీ బాగుంది కానీ ఫ్యాన్స్ కి ఇది సరిపోదని తేల్చి చెప్పేశారట. దాంతో ఎప్పటి నుంచో పెట్టుకున్న కథని బాలకృష్ణ కు వినిపించాడట. లైన్ చెప్పగానే అదిరిపోయింది. మనం ఇదే చేస్తున్నాం అన్నారట బాలయ్య. అంతే కాకుండా నేను సీమ నేపథ్యంలో సినిమా చేసి చాలా రోజులవుతోంది. ఇప్పుడు చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా దీన్నే చేద్దాం అన్నారట. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మూడు నెలల్లో కథ ని పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లారట.
సినిమాలో రెండు క్యారెక్టర్లు వున్న కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం టైటిల్ పాత్రకే అని చెప్పుకొచ్చాడు. తండ్రీ కొడుకుల కథ అనగానే పాత సినిమాలు గుర్తొస్తాయని చెల్లెలి సెంటిమెంట్ ని పెట్టం అన్నాడు.
అంతే కాకుండా ఈ సినిమా కోసం భారీ రిస్క్ చేశాం. బాలయ్య సినిమాల్లో సాధారణంగా సెకండ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ కి ఎంటరవుతుంది. అయితే ఈ సినిమాలో మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ కె ఆ క్యారెక్టర్ ని చంపేశాం. దాన్ని జస్టిఫై చేయడం కోసం సెకండ్ హాఫ్‌ని చాలా గ్రిప్పింగా తీసుకెళ్లే ప్రయత్నం చేశామని అసలు విషయం బయటపెట్టారు గోపీచంద్ మలినేని.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.