మరోసారి లౌక్యం కాంబినేషన్ సెట్

Update: 2016-04-07 19:30 GMT
టాలీవుడ్ హీరో గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది లౌక్యం. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత.. ఇప్పటివరకూ సక్సెస్ సాధించలేకపోయాడు గోపీచంద్. శ్రీవాస్ దర్శకుడిగా రూపొందిన లౌక్యం.. బాక్సాఫీస్ దగ్గర ఓ సెన్సేషన్ నే సృష్టించింది. ఇఫ్పుడీ కాంబినేషన్ మరోసారి సెట్ అవుతోందని తెలుస్తోంది. లౌక్యం సాధించిన సక్సెస్ తర్వాత శ్రీవాస్ రేంజ్ మారిపోయింది. ఒక్కసారిగా నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా చేసే ఆఫర్ ని దక్కించుకున్నాడు.

డిక్టేటర్ అంటూ బాలయ్యతో శ్రీవాస్ రూపొందించిన చిత్రం గత సంక్రాంతికి విడుదలైంది. రిజల్ట్ యావరేజ్ అయినా.. ఫ్యాన్స్ మాత్రం డిక్టేటర్ విషయంలో సంతృప్తి చెందిన మాట వాస్తవం. బాలయ్యతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా శ్రీవాస్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి లౌక్యం హీరో గోపీచంద్ తో ఈ డైరెక్టర్ మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈసారి తను కూడా ఓ నిర్మాతగా ఉండేందుకు సిద్ధమవుతున్నాడట. శ్రీవాస్ సొంత బ్యానర్ వేదాశ్వ క్రియేషన్స్ తో పాటు.. ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టోరీని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు శ్రీవాస్. తనకు లౌక్యం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మూవీ విషయంలో గోపీచంద్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు.  ప్రస్తుతం జ్యోతికృష్ణ డైరెక్షన్ లో ఆక్సిజన్ అనే మూవీ చేస్తున్నాడు గోపీచంద్
Tags:    

Similar News